Begin typing your search above and press return to search.
అగ్ర నిర్మాత టిక్ టాక్ అడిక్షన్
By: Tupaki Desk | 5 Dec 2019 6:48 AM GMTసాయి తేజ్ - రాశీ ఖన్నా జంటగా మారతి తెరకెక్కిస్తున్న ప్రతిరోజు పండగే ట్రైటర్ రిలీజై ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. శతమానం భవతి తరహాలో బంధాలు అనుబంధాలు కాన్సెప్టుతోనే ఈ సినిమా తెరకెక్కుతోందన్న పోలిక కనిపించింది. ఇక ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయకుడి మరదలిగా నటిస్తోంది. ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలు చేసే పల్లెటూరమ్మాయి గా రాశీ కనిపించబోతోంది.
అయితే రాశీ టిక్ టాక్ అడిక్షన్ పాత్ర ఎలా పుట్టింది? అన్నదానికి తాజాగా చిత్ర సమర్పకుడు.. బాస్ అల్లు అరవింద్ పరోక్షంగా క్లారిటీనిచ్చారు. ప్రతిరోజూ పండగే ట్రైలర్ వేడుక లో బాస్ అరవింద్ కు ఉన్న టిక్ టాక్ అడిక్షన్ అలవాటే రాశీ పాత్ర పుట్టడానికి కారణమని రివీలైంది.
టిక్ టాక్ కి ఆరంభమే అడిక్ట్ అయ్యారట బాస్. అంతేకాదు.. యూత్ ఎలా అడిక్ట్ అవుతోంది అన్నది అరవింద్ తొలినాళ్ల నుంచి చూస్తున్నారట. అంతేకాదు తనకు కూడా టిక్ టాక్ లో యూత్ ఎలా ప్రవర్తిస్తున్నారు.. ఎలాంటి వీడియోలు చేస్తున్నారు? అన్నది చూసే అలవాటు ఉందట. తాను టిక్ టాక్ వీడియోలు చేయక పోయినా.. యువతరాన్ని ఫాలో అవుతానని తెలిపారు. తనని చూసి మారుతి రాశీ పాత్ర ను క్రియేట్ చేశారన్న పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతి రోజూ పండగే డిసెంబర్ 20న రిలీజవుతోంది.