Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ఒక టపాసులాంటివాడు: అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   3 Nov 2021 3:45 AM GMT
బాలకృష్ణ ఒక టపాసులాంటివాడు: అల్లు అరవింద్
X
అల్లు అరవింద్ కి ముందు చూపు ఎక్కువ .. ఆయన ప్లానింగ్ పక్కాగా ఉంటుంది .. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెడితే దానిని విజయం వైవు పరుగులు తీయించేవరకూ ఆయన నిద్రపోరని ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసిన వాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. విరామం తీసుకోవాలనుకునేవారికి విజయం ఎప్పుడూ ఆమడదూరంలో ఉంటుందని నమ్మిన ఆయన, అలా నాన్ స్టాప్ గా పరిగెడుతూనే ఉన్నారు. కొత్త ప్రయత్నాలు .. ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆయన 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు.

ఒక వైపున సినిమాల నిర్మాణాన్ని .. మరో వైపున 'ఆహా' కోసం కొత్త కాన్సెప్టుల రూపకల్పనను చూసుకుంటూ దూసుకుపోతున్నారు. తెలుగువారికి ఓటీటీని పరిచయం చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అంటూ, ఆ మాటను నిలబెట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఈ వయసులో ఆయన కొత్తగా ఆలోచన చేయడం .. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి తపించడం .. ఈ జనరేషన్ ను మెప్పించడం ఆయన గొప్పతనమనే చెప్పాలి.

అలాంటి అల్లు అరవింద్ నిన్నరాత్రి జరిగిన ఈవెంట్ లో మాట్లాడుతూ .. "ఈ దీపావళి సందర్భంగా 'ఆహా' నుంచి పేలనున్న పటాకా 'అన్ స్టాప బుల్'. అది అనుకోకుండా గబుక్కున వెలిగిన ఒక తారాజువ్వ. మా చర్చల్లో నెక్స్ట్ టాక్ షో ఎవరు చేస్తే బాగుంటుంది అనే టాపిక్ వచ్చింది. దాని గురించి మేమంతా 'జూమ్' కాల్ లో మాట్లాడుకుంటున్నాము. మా టీమ్ లోని వాళ్లంతా రకరకాల పేర్లు చెప్పారు. అప్పుడు నేను ''బాలకృష్ణగారు చేస్తే బాగుంటుంది'' అన్నాను. 'ఆయన చేస్తారా?' అన్నారు.

బాలకృష్ణ గారికి నేను కాల్ చేస్తే ఆయన తీస్తారు .. అది నాకు తెలుసు.అందుకే ఆయనకి ఫోన్ చేశాను. 'బ్రదర్ ఎక్కడ ఉన్నారు .. ఎలా ఉన్నారు?' అన్నారు. "మీరెక్కడ ఉన్నారు" అన్నాను. 'నేను అవుట్ డోర్ షూటింగులో ఉన్నాను .. ఏంటి ఇలా చేశారు' అన్నారు. "మీరు 'ఆహా' చూస్తుంటారా"? అని అడిగితే 'చూస్తుంటేనే .. ' అన్నారు. "ఆ మధ్య సమంత టాక్ షో చేసింది కదా .. చూశారా మీరు'' అని అడిగాను. 'ఆ చూశాను .. బాగుంది' అన్నారు. అటువంటి టాక్ షో ఒకటి మీరు చేస్తే బాగుంటుంది .. మా 'ఆహా' టీమ్ ను పంపిస్తాను .. ఒకసారి వాళ్లు మీకు వివరిస్తారు" అని అన్నాను.

'నేను సోమవారం వస్తున్నాను .. ఆ రోజున పంపించండి' అన్నారు. సోమవారం రోజున ఆయన కాల్ చేసి 'ఎన్నింటికి వస్తున్నారు మీవాళ్లు?' అని అడిగారు. "11 గంటలకు అక్కడ ఉంటారు" అని చెప్పాను. అక్కడికి వెళ్లిన మా టీమ్ ఒంటిగంటకల్లా తిరిగొచ్చి, 'ఆయన కాన్సెప్ట్ విన్నారు .. బాగుందన్నారు .. చేస్తానన్నారు .. మీతో చెప్పామన్నారు' అన్నారు. ఇది చేస్తే బాగుంటుందని ఆయనకి అనిపించింది .. ఒప్పేసుకున్నారంతే. అంత ఈజీగా ఓకే చెబుతారని మేమూ అనుకోలేదు. ఆయన టపాసులాంటివాడు కదా" అంటూ నవ్వేశారు.