Begin typing your search above and press return to search.
అరే.. బన్నీ పక్కన హీరోయిన్ మిస్
By: Tupaki Desk | 19 May 2016 4:10 AM GMTమెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు బోలెడుమంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడీ కుటుంబం నుంచి ఓ హీరోయిన్ కూడా వచ్చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరోయిన్ గా తొలిసినిమా 'ఒక మనసు' విడుదలకు సిద్ధమైంది. రీసెంట్ గా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను హైద్రాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నీహారిక మేనమామ - మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఆసక్తిని కలిగించాయి.
ఇండస్ట్రీలో వారసులుగా హీరోలు మాత్రమే వస్తున్నారని.. హీరోయిన్ గా నీహారికను ఇండస్ట్రీకి అందించిన నాగబాబు - ఆయన భార్య పద్మలకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్. ఆ తర్వాతే అసలు సంగతి మొదలైంది. 'నాగ శౌర్య ఏమనుకుకోకపోతే ఓ విషయం చెబ్తాను. నా డాళింగ్ నీహారిక హీరోయిన్ అవుతుందని కొన్నాళ్లు, అవదని కొన్నాళ్లు డిస్కషన్స్ నడిచాయి. ఓ రోజు సడెన్ గా మీడియాలో నీహారిక సినిమా గురించి చూసి షాక్ తిన్నాను' అన్న అరవింద్ ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.
'నీహారిక హీరోయిన్ గా అంటే.. బన్నీ పక్కన చేయించే వాళ్లమే అనుకున్నాను. అప్పటికే సరైనోడు స్టార్ట్ అయిపోవడంతో సైలెంట్ అవాల్సి వచ్చింది. నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కనీసం నాగబాబుకు కూడా. అప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు అందరి ముందు చెబుతున్నాను' అంటూ ముగించాడు అల్లు అరవింద్. మొత్తానికి ఈ బావామరదళ్లు.. ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాటే.