Begin typing your search above and press return to search.
కొడుకుతో డేటింగ్ గురించి హీరోయిన్నే నేరుగా అడిగేశారా..?
By: Tupaki Desk | 5 Nov 2022 4:36 AM GMTఅల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.. యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తొంది.
'ఊర్వశివో' సినిమాలో శిరీష్ మరియు అను బేబీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కట్ అయింది. రొమాంటిక్ సన్నివేశాలు - ఇంటిమేట్ సీన్స్ లో ఇద్దరూ ఎంతో ఈజ్ తో నటించారు. నిజానికి ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ లో ప్రధాన జంట కెమిస్ట్రీ చూసి.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి.
ఇద్దరూ బయట కలిసి కనిపించడంతో అల్లు శిరీష్ తో అను ఇమ్మన్యుయెల్ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఇదే విషయం గురించి శిరీష్ తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డైరెక్ట్ గా అను ఇమ్మానుయేల్ ని అడిగేశాడట.
'ఊర్వశివో రాక్షసివో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అను ఇమ్మానుయేల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి మూవీ ఓపెనింగ్ రోజే శిరీష్ ని మొదటిసారిగా కలిశాను. ఆ తరవాత సినిమా గురించి ఓ కాఫీ షాప్ లో మాట్లాడుకున్నాం. అంత మాత్రానికే డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ క్రియేట్ చేశారు.
అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' మూవీలో నటించినప్పటి నుంచి నాకు ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అల్లు అరవింద్ గారు కూడా ఒకసారి ఈ విషయం మీద మాట్లాడారు. నా కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా? అని నన్ను అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అని అనూ చెప్పినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు శిరీష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ రూమర్స్ ని కొట్టి పారేశాడు. ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నప్పుడు అలాంటివి రావడం కామన్ అని పేర్కొన్నారు. మరోవైపు అను మాత్రం తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పడానికి కాస్త ఇబ్బంది పడింది.
లవ్ లో ఉందా? సింగిల్ గా ఉందా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా.. 'నాకు తెలియదు.. చెప్పకూడదు' అనేసింది అను. శిరీష్ మాత్రం అనూ ప్రేమలో ఉందని గెస్ చేశానని.. ఎప్పుడు చూసినా మొబైల్ చూసుకొని ముసిముసిగా నవ్వుకుంటుందని.. కొన్ని సార్లు సిగ్గుపడుతుందని.. అందుకే అలా అనిపించిందని అన్నారు.
ఇకపోతే 'ఊర్వశివో రాక్షసివో' సినిమాకు తొలి రోజే మంచి టాక్ రావడంతో చిత్ర బృందం గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందులో శిరీష్ - అనూతో పాటుగా దర్శకుడు రాకేష్ శశి - అల్లు అరవింద్ - బన్నీ వాసులు కూడా పాల్గొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.