Begin typing your search above and press return to search.

అన్న పెళ్లిలో బ‌న్ని మిస్సింగ్

By:  Tupaki Desk   |   22 Jun 2019 5:09 AM GMT
అన్న పెళ్లిలో బ‌న్ని మిస్సింగ్
X
అల్లు అర‌వింద్ వార‌సులు అనగానే అల్లు అర్జున్ .. అల్లు శిరీష్ మాత్ర‌మే అంద‌రికీ తెలుసు. కానీ ఆ ఇద్ద‌రికీ పెద్ద‌న్న‌ అల్లు బాబీ గురించి బ‌య‌టి జ‌నాల‌కు తెలిసింది త‌క్కువే. తండ్రికి ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్లో సాయం చేస్తుంటారు బాబి. ఆయ‌న హీరో కాదు కాబ‌ట్టి తెర‌వెన‌కే ఉండిపోయాడు. అందువ‌ల్ల బ‌య‌ట ప‌రిశ్ర‌మేత‌రుల‌కు తెలిసింది చాలా త‌క్కువ‌.

అయితే బాబీ ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తి. అత‌డు రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. వివాహానికి సంబంధించిన ఫోటోల్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు బాబి. అంతేకాదు.. ఈ పెళ్లి గురించి ఆయ‌నే వివ‌రాల్ని అందించారు. ``నేను పెళ్లి చేసుకున్నా. ఇది లైఫ్ లో కొత్త బిగినింగ్. తొలిగా నేను 2005 లో పెళ్లి చేసుకున్నా.. ఆ త‌ర్వాత 2016లో విడాకులు తీసుకున్నాను. సంతోష‌క‌ర‌మైన జీవితంలోకి వెళ్ల‌మ‌ని దేవుడు ఆశీస్సులు అందించారు. ఈ పెళ్లికి మా కుటుంబ స‌భ్యుల నుంచి అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు ఉన్నాయి`` అని ఇన్ స్టాలో వెల్ల‌డించారు.

బాబి తొలి భార్య నీలిమ బండి నుంచి 2016లో విడాకులు తీసుకున్నారు. యోగా ఇన్ స్ట్ర‌క్ట‌ర్ నీలు షాని అత‌డు పెళ్లాడార‌ని తెలుస్తోంది. నీలు షా ఎంబీఏ పూర్తి చేసి త‌న సోద‌రితో క‌లిసి యోగా ఇనిస్టిట్యూట్ ని నిర్వ‌హిస్తున్నార‌ట‌. అయితే ఈ పెళ్లిలో బ‌న్ని మిస్స‌య్యార‌ని తెలుస్తోంది. బ‌న్ని ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. అందుకే అన్న పెళ్లికి హాజ‌రు కాలేక‌పోయార‌ట‌.