Begin typing your search above and press return to search.
చాలా పరిణతితో హ్యాండిల్ చేసిన అల్లు బాబీ
By: Tupaki Desk | 25 Jun 2019 4:13 AM GMTమూడు రోజుల క్రితం అల్లు బాబీ నీలు షా ను రెండవ వివాహం చేసుకోవడం ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. బాబీ మొదటి వివాహం సంగతి అందరికీ తెలుసు కానీ విడాకుల విషయం ఎక్కువమందికి తెలియదు. దీంతో లో-ప్రొఫైల్ లో జరిగిన రెండవ వివాహం చాలామందికి షాక్ ఇచ్చింది. అయితే బాబీ వివాహం జరిగిన తర్వాత తన ఇన్ స్టా ఖాతా ద్వారా మ్యారేజ్ విషయం వెల్లడించారు.
2005 లో తన వివాహం అయిందని 2016 లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలిపారు. జీవితంలో ముందుకు సాగేందుకు మరోసారి వివాహం చేసుకున్నానని.. తనకు ఇది కొత్త ప్రారంభం అని.. దీవించాలని కోరారు. దీంతో పాటు ఈమధ్య జరిగిన వివాహం తాలూకు ఫోటోలను జత చేశారు. దీనికి ఎక్కువ మంది మనస్ఫూర్తిగా విషెస్ తెలిపారు. కానీ కొందరు మాత్రం తీవ్రంగా విమర్శించారు. కానీ బాబీ వారందరికీ ఎంతో పరిణతితో సంయమనం పాటిస్తూ సమాధానాలు ఇచ్చారు.
కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూడండి..
* నీలిమ.. అన్విత గురించి నేను బాధ పడుతున్నాను. ఇది వరస్ట్ డెసిషన్.. వరస్ట్ డాడీ ఎవర్
బాబీ: నా వివాహంతో మిమ్మల్ని నిరుత్సాహ పరిచినందుకు సారీ. డైవోర్స్ పరస్పర అంగీకారంతో తీసుకున్నవి.
*అన్విత ఎవరితో ఉంది?
బాబీ: నాతో కాదు... తనతో కాదు.. మాతో ఉంది
*మీ అమ్మాయి మీ నిర్ణయంతో సంతోషంగా ఉందా?
బాబీ: నేను మూడేళ్ళకు పైగా సింగిల్ గా ఉన్నాననే విషయాన్ని.. నాకు ఒక జీవిత భాగస్వామి అవసరమనే నిజాన్ని తను అర్థం చేసుకున్న తర్వాతే నేను వివాహం చేసుకున్నాను
*కానీ మీ బేబీ?
హ్యాపీ డాడీ + హ్యాపీ మమ్మీ + హ్యాపీ చైల్డ్
*మరి అన్విత సంగతి ఎలా?
బాబీ: నేను పదేళ్ళ క్రితం విడిపోయాను. డైవోర్స్ తీసుకుంది మూడేళ్ళ క్రితం. మా పాప మానసికంగా ఎదిగేవరకూ నేను వేచి చూడడం జరిగింది. అప్పుడే నేను నా సెకండ్ ఛాన్స్ తీసుకున్నాను. అన్విత లైఫ్ లో నేను నీలిమ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాము.
*(ఒకరు కోపం తో తిడితే..)
బాబీ: నేను అన్నిటినీ స్వీకరిస్తున్నాను. మీ కోపాన్ని.. బాధను కూడా.
ఇదంతా ఒక ఎత్తైతే అల్లు అర్జున్ ఈ వివాహానికి హాజరు కాలేదని.. పేరెంట్స్ ఒప్పుకోలేదని ఇలాంటి గాసిప్స్ ప్రచారం అయ్యాయి. వీటికి సమాధానంగా ఇన్ స్టా గ్రామ్ లో "దీవెనలు అందించినందుకు కృతజ్ఞతలు. నా రిసెప్షన్ 'మూవీ' త్వరలో బయటకు వస్తుంది! పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పడుతుంది కదా" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ ను.. నెగెటివిటీని బాబీ చాలా పరిణతితో హ్యాండిల్ చేశారని చెప్పవచ్చు.