Begin typing your search above and press return to search.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై నన్ను బౌలింగ్ చేయమన్నారు: అల్లు బాబీ
By: Tupaki Desk | 3 Nov 2021 3:49 AM GMT'ఆహా'ను 2.0 పేరుతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనున్నారు. చాలా కాలంగా జరుగుతున్న కసరత్తు తరువాత, ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ నిన్నరాత్రి ఒక ఈవెంట్ ను నిర్వహించారు. 'ఆహా' టీమ్ .. అల్లు ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కొందరు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ వేదికపై అల్లు బాబీ మాట్లాడుతూ .. "ముందుగా నేను 2019లో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలి. ఒక రోజున మా నాన్నగారు వచ్చి 'మై హోమ్ గ్రూప్'తో కలిసి ఇలాగా 'ఆహా' చేయబోతున్నామని చెప్పారు.
ఓటీటీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని నన్ను అడిగారు. నేనన్నాను .. ఓటీటీ అనేది ఒక క్రికెట్ లాంటిది నాన్న .. బ్యాటింగ్ అనేది కంటెంట్ అనుకుందాం .. బౌలింగ్ అనేది టెక్నాలజీ అనుకుందాం .. ఆ రెండూ ఇంటర్ ఛేంజ్ అవుతూ ఉంటేనే ఆట నడుస్తూ ఉంటుంది. అలా చేస్తే బాగుంటుంది నాన్న అని చెప్పాను. మీరు బ్యాటింగ్ చేస్తున్నారు .. మరి బౌలింగ్ ఎవరు చేస్తున్నారు? అని అడిగాను. ఒక్క నిమిషం ఆగు బాబీ అని చెప్పేసి ఒక బాల్ ను తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, 'నువ్వే చేయబోతున్నావ్' అని చెప్పారు.
అదెలా కుదురుతుంది .. నాది ఇప్పుడే 'గని' స్టోరీ ఓకే చేశారు .. చాలా ఏళ్ల నుంచి నేను 'గని' ప్లాన్ చేసుకున్నాను అని అన్నాను. నో .. నో . నువ్వు అదీ చేసేయ్ .. ఇదీ చేసేయ్ అన్నారు. అటూ అటూ చేసి మొత్తానికి నాకు అప్పగించారు. మాకు అది కావాలి .. ఇది కావాలి .. అది ఉంటే బాగుంటుంది .. ఇదుంటే బాగుంటుంది .. అంటూ లక్షల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్స్ తీసుకున్నాము.
లక్షల మంది కామెంట్లు తీసుకున్నాము. వాటన్నింటికీ ఒకచోట సమకూర్చి కొత్త అన్నిభూతిని ఇచ్చేలా 'ఆహా'ను తీర్చిదిద్దాము.
ఎప్పటికప్పుడు నాన్నగారు కొత్త వెర్షన్స్ గురించి అడిగేవారు. పెద్ద పెద్ద కంపెనీలకే పదేళ్లు పట్టింది .. నాకు పది నెలలైనా టైమ్ ఇవ్వండి అని అనేవాడిని. ఈ విషయంలో రామ్ జూపల్లి కూడా ఎంతో సపోర్ట్ చేశారు. 'ఆహా' ను ఈ స్థాయికి తీసుకురావడం కోసం అంకితభావంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.