Begin typing your search above and press return to search.

అల్లు బ్ర‌ద‌ర్స్: బాల్యంలో టీనేజీలో అడ‌ల్ట్ ఏజీలో

By:  Tupaki Desk   |   26 Aug 2021 12:30 AM GMT
అల్లు బ్ర‌ద‌ర్స్: బాల్యంలో టీనేజీలో అడ‌ల్ట్ ఏజీలో
X
ఇటీవ‌లి కాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన‌ కొన్ని అరుదైన దృశ్యాలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. చిరు-ప‌వ‌న్-నాగ‌బాబు త్ర‌యం ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో సునామీలా చుట్టేశాయి. రక్షాబంధ‌న్ రోజంతా మెగా బ్ర‌ద‌ర్స్ త్ర‌యం గురించే ఈ చర్చంతా.

కాస్త ఆల‌స్యంగా అయినా అల్లు బ్ర‌ద‌ర్స్ త్ర‌యం ఇదిగో ఇలా బ‌య‌ట‌ప‌డ్డారు ఓ ఫోటో రూపంలో. ఇందులో అల్లు అర్జున్ కి అటూ ఇటూ బ్ర‌ద‌ర్స్ శిరీష్ -బాబి ఉన్నారు. బాల్యంలో టీనేజీలో అడ‌ల్ట్ ఏజీలో ఆ ముగ్గురూ ఎలా మారారు? అన్న‌ది ఈ ఫోటో ఎలివేట్ చేస్తోంది. నూనూగు మీసాల బ‌న్ని తొలి నుంచి ఒకే లెవ‌ల్ ని మెయింటెయిన్ చేస్తే శిరీష్ లో మాత్రం అనూహ్య మార్పులు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజీలో అల్లు శిరీష్ పూర్తి బ‌బ్లీగా మారిపోయి క‌నిపించాడు. అందుకే అత‌డు హీరో అవుతాడా లేదా? అని కూడా సందేహించారు. పైగా శిరీష్ ఎప్పుడు నాన్న కూచీలా అల్లు అర‌వింద్ త‌ర‌హాలోనే నిర్మాత‌గా ఎదుగుతాడ‌ని భావించారు.

కానీ అనూహ్యంగా శిరీష్ రూట్ మార్చాడు. హీరో అయ్యాడు. హీరోగా రాణించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అన్న‌య్య అల్లు అర్జున్ నుంచి స‌ల‌హాలు తీసుకుని కెరీర్ ప‌రంగా ఎదిగేందుకు శిరీష్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. కెరీర్ లో కొన్ని విజయాలు కొన్ని ప‌రాజ‌యాలు ఒడిదుడుకులు అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్లాల‌న్న‌దే ధృఢ నిశ్చ‌యం. ప్ర‌స్తుతం అత‌డు ప్రేమ కాదంట అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. లివిన్ రిలేష‌న్ షిప్ నేప‌థ్యంలో ఆద్యంతం రొమాంటిక్ గా సాగే చిత్ర‌మిది.

ఇటీవ‌ల‌ ఫ‌స్ట్ లుక్ కి పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అల్లు శిరీష్ -అనూ రొమాన్స్ పీక్స్ లో క‌నిపిస్తోంది. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

మ‌రోవైపు బ‌న్ని మూడు ఏజ్ గ్యాప్ ల‌లో బ్యాలెన్స్ డ్ గా క‌నిపిస్తున్నాడు. అత‌డు గంగోత్రితో సినీప‌రిశ్ర‌మ‌కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యేప్ప‌టికే కండ‌లు పెంచాడు. ఆ త‌ర్వాత నా పేరు సూర్య చిత్రంతో రూపాన్ని పీక్స్ కి చేర్చాడు. మ‌రోవైపు ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లో ఫ్యామిలీ మ్యాన్ లా కూడా క‌నిపిస్తున్నాడు. సోద‌రుడు బాబి మాత్రం సాఫ్ట్ జెంటిల్ మ‌న్ లా ఉన్నాడు. ఆయ‌న నిర్మాత కం న‌టుడిగా కొన‌సాగుతున్నారు.