Begin typing your search above and press return to search.

శిరీష్ పుట్టిన రోజు అల్లు ఫామిలీ ఇలా సెలెబ్రేట్ చేసింది

By:  Tupaki Desk   |   30 May 2020 11:50 AM GMT
శిరీష్ పుట్టిన రోజు అల్లు ఫామిలీ ఇలా సెలెబ్రేట్ చేసింది
X
ఈరోజు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఫ్యామిలీలో ఒకరి పుట్టినరోజు కేక్ కటింగ్ జరిగింది. ఆ బర్త్ డే బాయ్ ఎవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్. ఈరోజే అల్లు శిరీష్ తన 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ శిరీష్ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసింది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్వయంగా కేక్ తయారు చేసిందట. ఇక తన కుటుంబ సమక్షంలో శిరీష్ కేక్ కటింగ్ చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో బర్త్ డే రావడం కష్టమే అనిపించినా హ్యాపీగా ఫీల్ అవ్వక తప్పదు. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి. ఈ సెలెబ్రేషన్స్ లో శిరీష్ పేరెంట్స్ అల్లు అరవింద్ ఆయన భార్య, అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి, వెంకటేష్.. ఇంకా పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష్.. తన పుట్టినరోజు జరిపినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. అంతేగాక నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు.. అంటూ సోషల్ మీడియాలో చెప్పాడు.

ఇక ఈ సందర్బంగా.. అల్లు శిరీష్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. స్కూల్ డేస్‌లో అయితే నా బర్త్ డే ఎప్పడూ సమ్మర్ వెకేషన్‌లో వస్తుండేది. దాంతో ఫ్రెండ్స్ ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదు. అందుకే ఎక్కువగా బర్త్ డే జరుపుకోలేదు. కేవలం మూడు నాలుగుసార్లు మాత్రమే జరుపుకొన్నాను. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత మీడియా మిత్రులతో, ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకొంటున్నాను.. అని అల్లు శిరీష్ తెలిపాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ - శిరీష్ లకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఓ మంచి స్నేహం ఉంది. ఎప్పుడు చూసినా స్నేహితుల్లాగే సందడి చేస్తుంటారు. ఇక సినీ ఇండస్ట్రీలోకి గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్.. తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు.. ఒక్కక్షణం.. ఏబీసీడీ సినిమాలలో అలరించాడు. ఏబీసీడీ తర్వాత ఇంతవరకు శిరీష్ నెక్స్ట్ సినిమా మొదలు కాలేదని సమాచారం.