Begin typing your search above and press return to search.
రియల్ హీరో అనిపించుకున్న శిరీష్
By: Tupaki Desk | 21 Feb 2019 8:02 AM GMTమెగా హీరోల్లో అల్లు శిరీష్ సక్సెస్ కోసం, స్టార్ డం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. మెగా హీరో బ్రాండ్ ఉన్నప్పటికి అల్లు శిరీష్ మాత్రం అంతగా సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాడు. తాజాగా మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' చిత్రంను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన మెల్ల మెల్లగా... పాటను విడుదల చేయడం జరిగింది.
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్సాన్ దిల్లోన్ నటించింది. పాట విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. మెల్ల మెల్లగా సాంగ్ ను రోడ్డు మీద చిత్రీకరిస్తున్నాం. ఆ సమయంలో కొందు తాగుబోతులు అటుగా వచ్చారు. అందులో ఒకరు రుక్సాన్ ను కామెంట్ చేశారు. ఆ విషయాన్ని మేము పట్టించుకోకుండా మా పనిలో మేం పడ్డాం. కాని శిరీష్ మాత్రం షాట్ పూర్తి అయిన తర్వాత వెళ్లి అతడిని తీసుకు వచ్చి క్షమాపణలు చెప్పించాడంటూ దర్శకుడు అన్నాడు. హీరోయిన్ ను కామెంట్ చేసిన వ్యక్తితో క్షమాపణలు చెప్పించి రియల్ హీరో అనిపించుకున్నాడు.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించిన భరత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మీడియా సమావేశంలో అల్లు శిరీష్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. పుల్వామా ఉగ్ర దాడిని ఖండించిన భరత్ మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే దేశ సరిహద్దుల వద్ద జవాన్ ల వల్లే అన్నాడు. ఇక అల్లు శిరీష్ మాట్లాడుతూ.. బెంగళూరుకు నేను వెళ్లినప్పుడు అక్కడ ఒక పాట విన్నాను. ఆ పాట నాకు బాగా నచ్చింది. ఆ పాటకు జుడా శాండీ సంగీతాన్ని అందించాడని తెలిసి సంప్రదించాము. శాండీ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నమ్ముతున్నాను అన్నాడు. మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.