Begin typing your search above and press return to search.
క్రేజీ హీరో బ్రేకప్ లవ్ స్టోరీ కథేంటీ..?
By: Tupaki Desk | 19 Oct 2022 9:30 AM GMTక్రేజీ స్టార్ల లవ్ స్టోరీస్, బ్రేకప్ లు బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో చాలా తక్కువే. ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. చాలా వరకు హీరోలు ప్రేమలోపడుతున్నారు. పెద్దలని ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లకు ప్రాముఖ్యతనిస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం కింగ్ నాగార్జున నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే. ఇదే బాటలో కొంత మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. ప్రయత్నిస్తున్నారు. కొంత మంది ఆ ప్రయత్నాలని విరమించుకుని తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్న వాళ్లూ వుంటున్నారు.
ఈ జాబితాలో యంగ్ హీరో, మాస్టర్ మైండ్ అల్లు శిరీష్ కూడా చేరిపోయారు. గత రెండేళ్లుగా సినిమాల్లో కనిపించని అల్లు శిరీష్ త్వరలో 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.
సరికొత్త కథతో రూపొందుతున్న ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ని కలిగించడం ఖాయం అని, తనకు మంచి విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో వున్నాడు అల్లు శిరీష్.
'విజేత' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిట్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన హీరో అల్లు శిరీష్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
సినిమా గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన అల్లు శిరీష్ తన లైఫ్ లో వున్న ఆసక్తికర బ్రేకప్ లవ్ స్టోరీని వివరించాడు.
తన లైఫ్ లో మూడు క్రేజీ బ్రేకప్ లవ్ స్టోరీస్ వున్నాయని చెప్పిన అల్లు శిరీష్ అందులో ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించి షాకిచ్చాడు. ఒక మంచి పెద్దింటి ఫ్యామిలీకి చెందిన అందమైన అమ్మాయితో డీప్ లవ్ లో వున్నానని, అయితే ఎందుకో తెలియదు కానీ కొంత కాలం క్రితం తనకు బ్రేకప్ చెప్పానని వెల్లడించి షాకిచ్చాడు. అంతే కాకుండా అది ఇప్పటికీ తనని బాధిస్తోందని, తను అప్పట్లో తనకు బ్రేకప్ చెప్పడం కరెక్టా కాదా? అన్నది ఆలోచిస్తే అప్పట్లో మాత్రమే కరెక్ట్ అని ఇప్పడు మాత్రం కరెక్ట్ కాదనిపిస్తోందని తెలపడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.