Begin typing your search above and press return to search.
'ఆహా'తో శిరీష్ కి ఏ సంబంధం లేదా?
By: Tupaki Desk | 16 Jan 2022 3:35 PM GMTయంగ్ హీరో అల్లు శిరీష్ కొంతకాలంగా బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే. అతని చివరి సినిమా `ఏబీసీడీ` రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. సహజీవనం కాన్సెప్ట్ తో ఓ సినిమా చేస్తున్నా.. దానికి సంబంధించిన తాజా అప్ డేట్ లేదు. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదేగాక.. ఇతర కొత్త కమింట్ లపై చర్చిస్తున్నారని గుసగుసలు వినిపించినా ఏవీ లేవు. స్క్రిప్ట్ డిస్కషన్స్ లో కూడా పాల్గొంటున్నారా లేదా? అన్నది కూడా తెలియరాలేదు.
మరోవైపు శిరీష్ మనసు పొరుగు భాషలపైనా ఉందని.. బాలీవుడ్ ఎంట్రీ పై దృష్టిపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అతడు తరుచూ ముంబై వెళ్లి వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఆ దిశగా ప్రయత్నాలు ఎంత సీరియస్ గా చేస్తున్నాడు? అన్న దానిపైనా సరైన క్లారిటీ లేదు. అయితే శిరీష్ తండ్రి గారు.. నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో శిరీష్ ఆయనకు సహకరిస్తూ అక్కడ కెరీర్ ని ప్లాన్ చేస్తున్నారా? అన్నది కూడా అర్థంకాని వ్యవహారంగా మారింది. `జెర్సీ` చిత్రాన్ని బాలీవుడ్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యారు అక్కడ. ఈ నేపథ్యంలో అరవింద్ కి ఉన్న పరిచయాలతో శిరీష్ కి హిందీలో లైన్ క్లియరవుతోందనే భావిస్తున్నారు. ఒకవేళ హిందీ పరిశ్రమలో నిర్మాణ పరమైన పనులు చూసుకోవడం వరకే పరిమితమా? అన్నది కూడా శిరీష్ ఖండిస్తూ ఏదైనా ప్రకటించాల్సి ఉంటుంది. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇవన్నీ పక్కనబెడితే రెండు రోజులుగా ఆహా ఓటీటీ సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంటోంది. వినియోగదారుల్ని ఆహా యాప్ ఇబ్బంది పెడుతోంది. యాప్ క్లోజ్ అవ్వడం. .మరికొంత మంది యూజర్లు ఒకేసారి రెండు పరికరాలకు లాగిన్ కాలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యల్ని ఉద్దేశించి ఓ యూజర్ శిరీష్ కి ట్విటర్లో ట్యాగ్ చేసాడు.
దీంతో శిరీష్ రిప్లై ఇచ్చాడు. ఆహాతో తనకు సంబంధాలు లేవని.. దయచేసి కస్టమర్ కేర్ ని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేసాడు. ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ.. సాంకేతిక సలహాదారుగా అన్నయ్య బాబి.. అరవింద్ గారికే చెందుతాయని తెలిపారు. శిరీష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. కుటుంబంలో అందరికీ ఆహాతో సంబంధాలుండగా.. తనకెందుకు ఆ బాధ్యతలు లేవని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆహా యాప్ లో పెట్టుబడులు కేవలం బన్నీ-బాబి మాత్రమే పెట్టి .. దాని నిర్వహణ బాధ్యతలు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారా? లేక శిరీష్ కి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ప్రస్తుతానికి బాధ్యతలు అప్పగించలేదా? అంటూ గుసగుసగగా మాటా మంతీ సాగుతోంది. అన్నట్టు ఆహా సమస్యల్ని పరిష్కరించేది టెక్నికల్ టీమ్ కదా.. అందువల్ల తాజా సమస్యలపై రిలేటెడ్ టీమ్ కి శిరీష్ ఈ విషయాన్ని చెప్పారని ట్వీట్లతో అర్థమవుతోంది.