Begin typing your search above and press return to search.
ఫ్లాప్ ను ఒప్పుకున్న మరో మెగాహీరో
By: Tupaki Desk | 30 May 2019 5:30 PM GMTకొన్నాళ్ల క్రితం రామ్ చరణ్ 'వినయ విధేయ చిత్రం' ఫ్లాప్ అయ్యిందని.. చాలా కష్టపడ్డాం కాని మిమ్ములను మెప్పించలేక పోయాం అంటూ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ ప్రకటన ఆయనపై గౌరవంను మరింతగా పెంచింది. సినిమా ఫ్లాప్ అయినా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా హడావుడి చేయకుండా చరణ్ హుందాగా ప్రవర్తించాడు అంటూ మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా అల్లు శిరీష్ కూడా ఫ్లాప్ ను ఒప్పుకుని హుందాతనం చాటుకున్నాడు.
తాజాగా అల్లు శిరీష్ 'ఏబీసీడీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మలయాళంలో సక్సెస్ అయిన 'ఏబీసీడీ'ని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతూ వచ్చారు. కాని సినిమా తెలుగు వారి అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ఇంకాస్త బెటర్ ఎంటర్ టైన్మెంట్ ఉంటే బాగుండేది అన్న టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఏబీసీడీ ఫలితం గురించి స్పందిస్తూ.. మేము ఒక మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కాని అంచనాలను అందుకోలేక పోయాం అన్నాడు. అదే పోస్ట్ లో తన బర్త్ డే సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఒప్పుకోకుండా హిట్ అంటూ డబ్బాలు కొట్టుకునే హీరోలు ఉన్న సమయంలో మెగా హీరోలు ఇలా ఫ్లాప్ లను హుందాగా ఒప్పుకోవడం అభినందనీయం అంటూ మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.