Begin typing your search above and press return to search.
ఆమె దగ్గర ఉంది.. వీళ్ళ దగ్గర లేనిది
By: Tupaki Desk | 29 Jan 2016 1:30 PM GMTమొన్న జరిగిన ఐఫా ఉత్సవం వేడుకలు చాలా ఘనంగానే జరిగాయి. తొలిసారి హైదరాబాదులో జరుగుతున్నాయి కాబట్టి.. చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ ఈవెంట్ ను నిర్వహించారు నిర్వాహకులు. అయితే ఈ ఈవెంట్ లో అల్లు శిరీష్ ఎంత కామెడీ చేశాడో.. వ్యాఖ్యాతగా నవదీప్ అండ్ రెజీనా కూడా అలాగే ఇరగదీశారు. వారి కామెడి నుండి ఒక మచ్చుతునక మీ కోసం.
అప్పుడే స్టేజీ మీదకు వచ్చిన రెజీనా.. ''నా దగ్గరుంది మీ దగ్గర లేదు'' అనేసింది. దానితో ఏంటీ ఏంటీ అంటూ అల్లు శిరీష్ - నవదీప్ లు కంగారుపడిపోయారు. ''అబ్బే ఏం లేదు. మీ దగ్గర సక్సెస్ లేదు'' అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. ఆ దెబ్బతో శిరీష్ అండ్ నవదీప్ లకు కోపమొచ్చేసి.. సక్సెస్ ఏముంది.. మాకు డ్యాన్సులు ఫైట్లు బాగా వచ్చు నీకొచ్చా అంటూ ఇంకా కామెడీ చేశారు.
సాధారణంగా మనం ఇటువంటి కామెడీ బాలీవుడ్ అవార్డుల్లో చూస్తుంటాం. షారూఖ్ ఖాన్.. రణబీర్ కపూర్ వంటి టాప్ స్టార్లు.. తమ మీద తమ సినిమాల మీదనా సైటైర్లు వేసుకుంటూ.. కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా నడిపిస్తుంటారు. ఈ ట్రెండ్ ను ఇప్పుడు శిరీష్ వంటి యంగ్ స్టర్లు తెలుగులోకి తీసుకురావడం మంచి విషయమే.