Begin typing your search above and press return to search.

చంచల్ గూడ జైల్లో మెగా హీరో

By:  Tupaki Desk   |   9 July 2017 6:52 AM GMT
చంచల్ గూడ జైల్లో మెగా హీరో
X
మెగా హీరో ఏంటి.. చంచల్ గూడ జైలేంటి.. వ్యవహారం అంత వరకు ఎందుకొచ్చింది అని ఆశ్చర్యపోకండి. ఆ హీరోలు జైలుకెళ్లింది నేరం చేసి కాదు. ఓ సినిమా షూటింగులో భాగంగా. ఆ హీరో మరెవరో కాదు.. అల్లు శిరీష్. గత ఏడాది ‘శ్రీరస్తు శుభమస్తు’తో తొలి హిట్ అందుకున్న శిరీష్.. ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర షూటింగ్ చంచల్ గూడ జైలు పరిసరాల్లో జరుగుతోంది. అల్లు శిరీష్.. అవసరాల  శ్రీనివాస్.. ప్రవీణ్‌ తదితరులపై జైలు బయట.. లోపల కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు ఆనంద్. ఈ సందర్భంగా జైలు పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. షూటింగ్ అయ్యాక జైల్లో ఖైదీల్లో మార్పు తీసుకొచ్చే ‘మహా పరివర్తన్‌’ కార్యక్రమంలో అల్లు శిరీష్‌ పాల్గొన్నాడు. ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడాడు.

తెలిసీ తెలియక చేసిన తప్పులకు జైలు శిక్ష అను భవిస్తున్న ఖైదీలు.. ఇకపై తమ ప్రవర్తను మార్చుకుని సరైన మార్గంలో నడవాలని సూచించాడు. జైలుకు అప్పుడప్పుడూ సెలబ్రెటీల్ని తీసుకొచ్చి ఖైదీలతో మాట్లాడించే ప్రయత్నం అధికారులు చేస్తుంటారు. ఇక శిరీష్-ఆనంద్ సినిమా విషయానికొస్తే.. ఇదొక సైంటిఫిక్ టచ్ ఉన్న థ్రిల్లర్ అంటున్నారు. సురభి.. సీరత్‌ కపూర్‌ ఇందులో శిరీష్ కు జంటగా నటిస్తున్నారు. ‘స్వామి రారా’ నిర్మాత చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్నందిస్తున్నాడు.