Begin typing your search above and press return to search.
డబ్బులు ఉపయోగపడవ్ -అల్లు శిరీష్
By: Tupaki Desk | 6 Dec 2015 6:08 AM GMTచెన్నయ్ వరదల్లో మునిగిపోయింది. అల్లకల్లోలం అయిపోయింది. ప్రజలంతా తిండి - తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. పప్పులు - ఉప్పులు సంగతి సరేసరి. అన్నీ నీటపాలయ్యాయి. ఇప్పుడు పాలు - పంచదార లాంటివి బ్లాక్ మార్కెట్ అయిపోయాయి. ఇలాంటి టైమ్ లోనే అసలైన ఆపన్న హస్తం కావాలి. ఆదుకునే నాధుడు కావాలి.
సరిగ్గా ఇదే ఆలోచించింది ఈ యంగ్ టీమ్. రానా దగ్గుబాటి - నాని - మంచు మనోజ్ - మంచు లక్ష్మి - అల్లరి నరేష్ - మధుశాలిని. నిఖిల్ సిద్ధార్థ్ - నవదీప్ - తేజస్విని - అల్లు శిరీష్ .. వీళ్లంతా ఈ ఆదివారం హైదరాబాద్ లోని భారీ షాపింగ్ మాల్స్ కి వెళ్లి జనాల నుంచి ఫండ్ కలెక్ట్ చేసేందుకు ప్రణాళికలు వేశారు. మన చెన్నయ్.. మన సాయం అంటూ ఆర్థిక సాయం కోరుతున్నారు. ఇలా వచ్చిన డబ్బుతో జనాలకు కనీస అవసరాలు - ఎమర్జెన్సీ నీడ్స్ ని అందించాలన్నది ప్లాన్. ఈ విషయంపై అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ''కేవలం డబ్బులు ఇస్తే య్యూజ్ లెస్. ఈ సమయంలో డబ్బుల కట్టలూ.. ప్లాస్టిక్ మనీ.. ఎందుకూ ఉపయోగపడవ్. పప్పులు - ఉప్పులు - బియ్యం - రబ్బరు షూలు వగైరా వగైరా అందిస్తే వెంటనే ప్రజల్ని ఆదుకునేవాళ్లమవుతాం. డబ్బులతో అవి కొని చెన్నయ్ చేర్చితేనే మనం సక్సెస్ అయినట్లు.. సాయం చేసినట్లు'' అంటూ చాలా కరుగ్గానే కఠోర సత్యాన్ని చెప్పాడు.
అయితే డబ్బులంతా ఇలా సరుకుల రూపంలోకి మారి సాయంగా అందడానికి ఆన్ గ్రౌండ్ టీమ్ ఒకటి రెడీ చేశారట. అక్కడి బిజినెస్ కమ్యూనిటీతో టచ్ లోకి వెళ్లారట ఈ యువ హీరోలు. వీళ్ల చెన్నయ్ లింకులు వాడి మరీ సాయం చేస్తున్నారట. గుడ్ జాబ్ గయ్స్.