Begin typing your search above and press return to search.
మావయ్యను ఆకాశానికి ఎత్తేసిన శిరీష్
By: Tupaki Desk | 31 July 2016 5:36 PM GMTతమ అభిమాన నటుడు.. ఎవరు లేకపోతే వారికి అసలు టాలీవుడ్లో డెబ్యూ అనేదే కాస్త కష్టం అయ్యేదో.. ఎవరు తారు రోడ్డేస్తే వీళ్ళు దానిపై హ్యాపీగా బెంజ్ కారును నడిపేస్తున్నారో.. ఆయన గురించి మాట్లాడని మెగా ఫ్యామిలీ హీరో అంటూ లేరు. సర్దార్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్.. అనేక సందర్భాల్లో రామ్ చరణ్.. రుద్రమదేవి ఆడియో లాంచ్ లో అల్లు అర్జున్.. ఇతర ఈవెంట్లలో వరుణ్ తేజ్ - సాయిధరమ్ తేజ్.. ఇలా అందరూ మెగాస్టార్ చిరంజీవి గురించి చాలానే చెప్పారు.
అయితే కుర్రాడు శిరీష్ కు మాత్రం ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదు. అందుకే ఆదివారం సాయంత్రం ''శ్రీరస్తు శుభమస్తు'' ప్రీ రిలీజ్ ఈవెంటుకు చిరంజీవి రావడంతో.. తను కూడా ఆయన గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలని కొన్న సంవత్సరాల నుండి దాచుకున్న వాటిని ఇప్పుడు బయటకు తీశాడు ఈ అల్లు కుర్రాడు. ''మా అన్నయ్యల పిల్లలను చూసినప్పుడల్లా నాకు చిరంజీవి గారే గుర్తొస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన నన్ను చూసుకున్నట్లు నేను ఇప్పుడు మావయ్యగా వీళ్లని చూసుకోవాలి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్న నేను లావుగా ఉన్నానని వర్రీ అవుతుంటే.. మా మావయ్య చిరంజీవి గారు నన్ను ఇంట్లో పెట్టుకుని ఒక సంవత్సరంపాటు చూసుకున్నారు. సన్నగా అయ్యేలా జిమ్ముకు పంపి డైట్ కూడా చూసుకునేవారు. చిన్నప్పుడు ఒక టూరిస్టు స్పాటుకు వెళ్ళినా.. ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళినా.. అదే కేవలం ఆయన వలనే. ఆయన ఫారిన్ వెళితే గుర్తుపెట్టుకుని మరీ మాకు గిఫ్టులు తెచ్చేవారు. బర్తడేలకు గిఫ్టులు పంపేవారు. రేపు నేను కూడా పిల్లలకు ఆయన లాంటి ఫాథర్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ తన కృతజ్ఞతలను తెలుపుకున్నాడు శిరీష్.
ఇక సినిమాల్లోకి వస్తున్నపుడు చిరంజీవి ఇచ్చిన టిప్స్ గురించి చెబుతూ.. ''నాకు చిరంజీవిగారు రెండు టిప్స్ చెప్పారు. నెలకు ఒక 40-50 మందిని నువ్వు కలుస్తావ్. వారిని నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా.. వారు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. సో బాధ్యతగా వ్యవహరించి. ఓర్పుతో ఫోటోలకు ఫోజులివ్వు. ఇంకొకటి 'గుర్తింపు' గురించి చెప్పారు. మనిషికి ఆకలి - ఇల్లు - డబ్బు కాకుండా గుర్తింపు అంటే ఇష్టం. సో స్టాఫ్ - డైరక్టర్స్ - టెక్నీషియన్స్ ను ఎవరినైనా గుర్తించు అన్నారు. నేను నేర్చుకున్నాను. అవతలి వారి కళ్ళలో చూస్తే అది రెట్టింపు ఆనందం అని నాకు అర్దమైంది'' అనా్నడు ఈ కుర్ర హీరో.
ఇకపోతే చిరంజీవి గారు ఇలా తమ ఫ్యామిలీలోని అందరి హీరోలనూ ప్రోత్సహించడం అనేది చాలా పెద్ద విషయం.. దానికి కృతజ్ఞులం.. అంటూ ముగించాడు శిరీష్. తొలిసారి తన సినిమాకు చెందిన ఒక ఫంక్షన్ కు చిరంజీవి గారు రావడంతో.. ఇలా అంతా చెప్పేశాను అంటూ ముగించాడు.