Begin typing your search above and press return to search.
అల్లు శిరీష్ భగీరథ ప్రయత్నం దేనికోసమో..?!
By: Tupaki Desk | 13 Feb 2021 11:30 AM GMT6ప్యాక్ తో సంచలనం సృష్టించ కండల హీరోగా ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాడు అల్లు అర్జున్. యువతరానికి అతడే స్ఫూర్తి. ఇక తమ్ముడు శిరీష్ కి కూడా బన్నీనే స్ఫూర్తి అనడంలో సందేహమేం లేదు. ఇదిగో అతడి హార్డ్ వర్క్ చూస్తుంటే.. ఇదంతా అన్నను కొట్టేసేందుకేనా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
శిరీష్ మునుపటిలా లేడు. జిమ్ముల్లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. క్రమశిక్షణతో జీవనశైలిని కొనసాగిస్తున్నాడు. మహమ్మారి కాలాన్ని సద్వినియోగం చేసుకుని రూపాన్ని చాలావరకూ మార్చేసాడు. బాగానే కండలు పెంచాడు. ఇక సురక్షితంగా ఆరోగ్యంగా ఉండటానికి అతను అప్పుడప్పుడు కొన్ని చిట్కాలను పంచుకున్నాడు. ఇప్పుడు అతను తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తనను తాను ప్రిపేర్ చేస్తున్నాడిలా జిమ్ లో. చాలా కఠినంగానే మరోసారి శ్రమిస్తున్నట్టు అర్థమవుతోంది.
ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేశాడు. అందులో అతను బరువులు ఎత్తుతూ కఠిన వ్యాయామం చేస్తున్నాడు. ముఖ్యంగా అతడు షోల్డర్ లాడ్స్ బైసెప్ ట్రైసెప్ వంటి వాటిపై కాన్ సన్ ట్రేట్ చేసినట్టే అర్థమవుతోంది. "నేను తిరిగి వచ్చాను… క్రమశిక్షణతో పాటు మంచి ఆహారం .. ఎనర్జీకి శిక్షణ తీసుకుంటున్నా" అని వీడియోతో పాటు ట్వీట్ చేశాడు. అల్లు శిరీష్ ప్రస్తుతం రాకేశ్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు.

I'm back... To discipline, clean diet and strength training. pic.twitter.com/9FS6sSZnHU
— Allu Sirish (@AlluSirish) February 13, 2021