Begin typing your search above and press return to search.
అన్నను మించేదెపుడు తమ్ముడూ?
By: Tupaki Desk | 30 May 2019 5:51 AM GMTదాదాపు డజను మంది మెగా హీరోలు టాలీవుడ్ లో కెరియర్ ని సాగిస్తున్న సంగతి తెలిసిందే. మెగావృక్షం నీడలో ఇంతమంది హీరోలు పరిశ్రమలో ఎంతో ఉపాధికి సాయమవుతున్నారు. ఇక మెగా కాంపౌండ్ లోనే అల్లు కాంపౌండ్ సబ్ అని చెప్పాలి. అల్లు అర్జున్ - అల్లు శిరీష్ బ్రదర్స్ ప్రత్యేకించి తమ ఉనికిని చాటేందుకు నిరంతరం హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే అగ్ర కథానాయకుడిగా హవా సాగిస్తున్నారు. అయితే ఆరేళ్ల క్రితం అతడి సోదరుడు శిరీష్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటికే అరడజను పైగానే సినిమాల్లో నటించారు. కానీ కెరియర్ పరంగా ఆశించినంత ఎదుగుదల కనిపించలేదు. `శ్రీరస్తు శుభమస్తు` లాంటి హిట్ సినిమా.. కొత్త జంట లాంటి యావరేజ్ కెరియర్ లో ఉన్నా.. ఇతర సినిమాలన్నీ ఫ్లాప్ లుగా నిలవడంతో బ్యాక్ బెంచీకి పరిమితమవ్వాల్సి వచ్చింది. ఒక్క క్షణం.. ఏబీసీడీ కంటెంట్ బావుందని పేరొచ్చినా బాక్సాఫీస్ హిట్స్ గా మలచడంలో ఫెయిలయ్యారు.
అయితే ఇన్నేళ్ల కెరియర్ లో శిరీష్ ఎందుకు తాను ఆశించిన బ్లాక్ బస్టర్ ని అందుకోలేకపోతున్నారు? అన్నది మాత్రం ఓ ఫజిల్. ఎంచుకునే కథాంశాలు తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడేవే అయినా లోపం ఎక్కడుందో కానీ అనుకున్న బ్లాక్ బస్టర్ మాత్రం ఖాతాలో పడడం లేదు. మరి వీటన్నిటినీ విశ్లేషించుకుని ఈసారి ఎలాంటి కథల్ని ఎంచుకోబోతున్నాడు? కెరీర్ ని ఎలా షైనప్ చేయబోతున్నాడు? అన్నను మించిన తమ్ముడు అనిపించుకునేది ఎప్పటికి? అన్నది వేచి చూడాల్సిందే.
ఏబీసీడీ రిలీజ్ తర్వాత ఇప్పటివరకూ కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అయితే పలువురు నవతరం దర్శకులు స్క్రిప్టులు వినిపించారట. రానున్న ఐదు సినిమాలు పూర్తిగా యువతరాన్ని టార్గెట్ చేసే ప్రేమకథా చిత్రాలే ఉంటాయని శిరీష్ ఏబీసీడీ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే వాటిలో ముందుగా ఎవరి దర్శకత్వంలో స్క్రిప్టును ఓకే చేస్తారు? అన్నది వేచి చూడాల్సిందే. అలాగే మరో ఐదారేళ్ల పాటు హీరోగా కొనసాగి.. అటుపై నిర్మాతగా కొత్త బాధ్యతల్ని నెరవేర్చాల్సి ఉందని శిరీష్ ఇదివరకూ వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తించింది. అంటే అల్లు అరవింద్ వారసుడిగా అతడు ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ కొత్త బాధ్యతల్ని నిర్వర్తిస్తారన్నమాట. నేడు శిరీష్ బర్త్ డే సందర్భంగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు మారుతి సహా గీతా ఆర్ట్స్ బృందం .. మెగా బృందం శిరీష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.