Begin typing your search above and press return to search.
అల్లు హీరోకి 'గుర్తుకొస్తున్నాయి'
By: Tupaki Desk | 16 Dec 2016 5:30 PM GMTడిఫరెంట్ గా ఆలోచించడమే కాదు.. విభిన్నంగా ట్వీట్స్ పెట్టడంలో కూడా అల్లు శిరీష్ కి బోలెడంత ట్యాలెంట్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండే ఈ హీరోకి.. సడెన్ గా తన చిన్నతనం గుర్తుకొచ్చేసింది. అంతే గుర్తుకొస్తున్నాయి అన్నటైపులో.. 90ల్లో తాము అనుభవించిన చిన్నతనానికి.. ఇప్పటికి కంపేర్ చేస్తూ ఓ వీడియోతో పాటు ట్వీట్ పెట్టాడు.
అప్పట్లో అందరూ కలిసి సందడి చేయడం.. ఇప్పుడు ఎవరికి వాళ్లు సెల్ఫీలు తీసుకోవడంతో మొదలుపెట్టి.. 90ల్లో సైకిల్ తొక్కడం-కార్లు డ్రైవ్ చేయడం.. ఇప్పుడైతే ట్రాఫిక్ జంఝాటంలో ఇరుక్కోవడం లాంటి కంపేరిజన్స్ బోలెడన్ని చేశాడు. వాక్ మ్యాన్ లో టేపులు ఇరుక్కుపోవడం.. ఎంటీవీ వర్సెస్ యూట్యూబ్.. గాలపటాలు వర్సెస్ రిమోట్ డ్రోన్ లు.. ఫ్లాపీ డిస్క్ లు వర్సెస్ మైక్రో ఎస్డీ కార్డులు.. ఇలా కంపేర్ చేస్తూ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ప్యాకులు పెంచడాన్ని కూడా ఇండికేట్ చేశాడు.
'90ల్లో పిల్లలుగా ఉన్న మనం నిజమైన బాల్యాన్ని అనుభవించాం. ఎదగడానికి ఇది సరైన సమయం. వాక్ మ్యాన్స్.. డయల్అప్ ఇంటర్నెట్ లాంటివి మినహాయిస్తే చాలా వరకూ మిస్ అయిపోతున్నాం' అంటూ తెగ ఫీలయిపోయాడు అల్లు శిరీష్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/