Begin typing your search above and press return to search.

తను నా బేబి సిస్టర్ -అల్లు శిరీష్‌

By:  Tupaki Desk   |   1 May 2017 8:47 AM GMT
తను నా బేబి సిస్టర్ -అల్లు శిరీష్‌
X
సడన్ గా హీరో అల్లు శిరీష్‌.. అలాగే జీవికె వారి మనుమరాలు శ్రీయ భూపాల్.. ఒక పార్టీలో కలసి డ్యాన్సు వేస్తూ కనిపించారు. ఓ రెండు ఫోటో బయటకొచ్చాయి. ఇంకేముంది.. మనోళ్ళు ఆగుతారా? అదేంటి మొన్న అఖిల్ తో బ్రేకప్ అయ్యింది.. ఇప్పుడు ఈ అమ్మాయి శిరీష్‌ తో పార్టీ?? వాట్? హౌ? అంటూ నానా ప్రశ్నలు వేసుకున్నారు. అదిగో శిరీష్‌ సమాధానం చెప్పాడు చూడండి.

''నా స్నేహితుడు శరత్ రెడ్డి.. మరియు నా బేబి సిస్టర్ శ్రీయ తో వీకెండ్ ఎంజాయ్ చేశాను #friendsforlife'' అంటూ ఒక ఫోటో పెట్టి ట్వీటేశాడు అల్లు శిరీష్‌. ఈ దెబ్బతో అన్నింటిపైనా ఒక క్లారిటీ వచ్చేసింది. నిజానికి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అసలు శిరీష్‌ ఏంటి.. సడన్ గా యంగ్ హీరో అఖిల్ మాజీ లవ్వర్ శ్రీయ భూపాల్ తో పార్టీ ఏంటి అంటూ.. జనాలు డబుల్ మీనింగే వెతుక్కున్నారు. కాని శిరీష్‌ మాత్రం అందరికీ భయంకరమైన క్లారిటీ ఇచ్చేశాడు. సింపుల్ గా తను సిస్టర్ వంటిది.. పిచ్చి పిచ్చిగా ఆలోచించకండీ అంటూ చెప్పకనే చెప్పేశాడు.

ఇకపోతే ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ డైరక్షన్లో రాబోయే సినిమాకు కోసం శిరీష్‌ ప్రిపేర్ అవుతున్నాడు. ఈ మధ్యనే రిలీజైన మళయాళ డెబ్యూ ''1971 బియాండ్ బార్డర్స్'' సినిమా తనకు అనుకున్నంత కిక్ ఇవ్వకపోయినా కూడా.. ఇప్పుడు తన తెలుగు తదుపరిపై ఫోకస్ పెట్టాడట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/