Begin typing your search above and press return to search.

అమీర్ అలా.. అల్లుహీరో ఏమన్నాడంటే

By:  Tupaki Desk   |   29 Nov 2016 11:30 AM GMT
అమీర్ అలా.. అల్లుహీరో ఏమన్నాడంటే
X
ఓ సినిమాకి ప్రచారం ఎలా చేసుకోవాలనే విషయంపై అమీర్ ఖాన్ దగ్గర బోలెడన్ని ఐడియాలజీలు ఉంటాయి. సినిమాలకు మేకింగ్ వీడియోలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ అమీర్ మాత్రం తన మేకింగ్ వీడియో ఇచ్చాడు. తన మేకింగ్ అంటే.. కేరక్టర్ కోసం తను ఎలా మారాడనే సంగతి చెప్పాడన్న మాట.

97 కిలోల నుంచి సిక్స్ ప్యాక్ వరకూ తను ఎలా మారాడు.. ఎంత కష్టపడ్డాడనే సంగతులను వీడియో రూపంలో చూపించాడు అమీర్ ఖాన్. ఈ వీడియోను చూసి అల్లు హీరో షాక్ తినేశాడు.అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పాడు కూడా. 'OMFG.. అమీర్ ఖాన్ సంథింగ్ స్పెషల్ అంతే. ఎలాంటి మేకోవర్ చేశాడో? అది కూడా 50 ఏళ్ల వయసులో' అంటూ ట్వీట్ చేశాడు అల్లు శిరీష్. సాధారణంగా ఓ మైగాడ్ అంటూ ట్వీట్ పెడతారు కానీ.. ఈ అల్లు హీరో లేటెస్ట్ జనరేషన్ కదా. అందుకే ఓ మై ఫ..గోష్ లాంటి పెద్ద పదాన్నే వాడేశాడు.

అలా చెప్పకపోతే తను ఎంతగా ఫీలయ్యాడో చెప్పడం కష్టం కదా. నిజానికి ఈవీడియో చూస్తే అల్లు శిరీష్ ఏంటి.. ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయ్యి.. నోరు వెళ్లబెట్టాల్సిందే. అమీర్ ఖానా మజాకా? మరి అమీర్ సిక్స్ ప్యాక్ లు ఫుల్ ప్లెడ్జెడ్ గా చూడాలంటే మాత్రం అది డిసెంబర్ 23న దంగల్ రిలీజ్ అయ్యాక మాత్రమే సాధ్యం. సినిమాలో మరిన్ని షాక్ లు ఇస్తాడట ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.



'Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/