Begin typing your search above and press return to search.

మెగా తండ్రీ కొడుకులు యోగ

By:  Tupaki Desk   |   25 Jun 2015 5:09 AM GMT
మెగా తండ్రీ కొడుకులు యోగ
X
మెగా ఫ్యామిలీ నుంచి అనూహ్యంగా ఓ కొత్త హీరో వచ్చి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అల్లు శిరీష్‌ హీరో అవుతాడనేది ఎవరూ ఊహించనిది. అయితే అతడు హీరో అయ్యాడు. రెండో సినిమాతోనే విజయం అందుకుని తానేంటో చూపించాడు. ఇప్పుడు తండ్రి అరవింద్‌ సమక్షంలో, అన్న అర్జున్‌ సమక్షంలో రాటుదేలుతున్నాడు. ఇద్దరూ శిరీష్‌ని రకరకాల కోణాల్లో సానబెడుతున్నారు. ఈ తరుణంలో శిరీష్‌ ఓ ఆసక్తికరమైన సంగతిని చెప్పాడిలా..

''నాన్న(అరవింద్‌)గారికి యోగాతో 12 సంవత్సరాల అనుబంధం ఉంది. నాన్న విషయంలో యోగా బాగా వర్కవుటైంది. 60లోనూ 20ఏళ్ల కుర్రాడిలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారంటే అందుకు కారణం యోగానే. నాలుగేళ్ల క్రితం నాక్కూడా యోగాని పరిచయం చేశారు. అప్పట్నుంచి వారంలో మూడు సార్లు గంట చొప్పున నాకు అదే పని. యోగ ఫలం ఎలా ఉంటుందో స్వయంగా టేస్ట్‌ చేశా. మునుపటి కంటే ఇప్పుడు చేసే పనిమీద కాన్‌సన్‌ట్రేషన్‌ పెరిగింది. ఇప్పుడు యోగాతో ప్రేమలో పడ్డాను'' అంటున్నాడు శిరీష్‌.

ఈ యంగ్‌ మెగా హీరో చెప్పినదానిని బట్టి యోగ సాధన ద్వారా తండ్రి కొడుకులులిద్దరూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని అర్థమవుతోంది. అంతేకాదు శిరీష్‌ హీరోగా ఎదగడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని కూడా అర్థం అవుతోంది.