Begin typing your search above and press return to search.

వెడ్డింగ్ సీజన్స్‌ లో సౌత్ హీరోల సూపర్ స్టైలింగ్..!

By:  Tupaki Desk   |   7 Dec 2021 8:30 AM GMT
వెడ్డింగ్ సీజన్స్‌ లో సౌత్ హీరోల సూపర్ స్టైలింగ్..!
X
టాలీవుడ్ హీరోలందరూ స్టైలింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోడల్స్‌ కు ఏ మాత్రం తీసిపోని హీరోలు చాలా మందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మోడలింగ్‌ లో ఇప్పుడు మన స్టైల్ ఐకాన్స్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలు.. అందులోనూ దక్షిణాది హీరోలే ఎక్కువగా స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు.

యువ హీరోలైన అల్లు శిరీష్ - విజయ్ దేవరకొండ లతో పాటుగా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ వంటి వారికి సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌ ఉంది. వాళ్ళ స్టైలింగ్ కూడా ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుండటంతో ఈ ముగ్గురు హీరోలు తాజాగా స్టైలింగ్ ఐకాన్స్‌ లా మారిపోయారు.

సోషల్ మీడియా వేదికగా తాజాగా బయటికి వచ్చిన వీరి ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అద్భుతమైన వేషధారణలతో ఆకర్షించే లుక్స్ తో విజయ్ - శిరీష్ - దుల్కర్ ఆకట్టుకుంటున్నారు. అన్ని విషయాల్లో వాళ్ళని అనుసరించే అభిమానులు.. వీరిని చూసి అలాగే రెడీ అవ్వాలని కోరుకుంటూ ఫ్యాషన్ లో స్ఫూర్తిని పొందుతున్నారు.

ఇందులో అల్లు శిరీష్ మొత్తం తెలుపులో మెరిసిపోతున్నాడు. ముఖ్యంగా వైట్ చుడీదార్ - దుప్పట్టా కాంబినేషన్‌లో వేసుకున్న వతెల్లటి షర్వానీ పెళ్లికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఈ డ్రెస్‌ లో ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. డీటైలింగ్ వెళ్తే గోల్డెన్ కప్స్.. అలాగే కాలర్స్ కూడా గోల్డ్‌ లోనే ఉన్నాయి. బ్రౌన్ కలర్ షూస్‌ తో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు శిరీష్. ఇప్పుడు ఈ అల్లువారబ్బాయి పెళ్లి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టైల్‌ లో పెళ్ళికి వెళ్తే కచ్చితంగా అక్కడున్న అమ్మాయిలంతా మమ్మల్నే చూస్తారేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అంటేనే స్టైల్ ఐకాన్ గా భావిస్తుంటారు. పైగా ఈయన స్పెషల్ డిజైనర్ వేర్ వేసుకుంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు వీడీ వైట్ కుర్తా - వైట్ చుడిదార్ కాంబినేషన్‌లో పింక్ షర్వానీలో అదిరిపోతున్నాడు. ఇది నిజంగా గేమ్ ఛేంజర్ లుక్‌ లా ఉంది. ఇది కచ్చితంగా ఫ్యాషన్ వరల్డ్‌ లో సంచలనమే. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి ఫిదా అయ్యారు. విజయ్‌ లా స్టైల్ అప్ అవుతున్నారు.

యూత్ స్టైల్ ఐకాన్స్‌ లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉంటారు. ఈయన వేసుకున్న వైట్ కలర్ చుడిదార్ కాంబినేషన్‌లో ఉన్న మెరూన్ కలర్ షర్వాని అదిరిపోయింది. దానికి గోల్డెన్ బటన్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇది కూడా పర్ఫెక్ట్ వెడ్డింగ్ క్యాస్ట్యూమ్. ఈ డ్రెస్‌ లో ప్రతీ చిన్న డిటైలింగ్ ఆకట్టుకుంటుంది. నీట్ కర్చీఫ్ - గోల్డెన్ బటన్స్ - ఐబాల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి.

రాబోయే పెళ్లిళ్ల సీజన్ లో అల్లు శిరీష్ - విజయ్ దేవరకొండ - దుల్కర్ సల్మాన్ సూపర్ స్టైలింగ్ ట్రెండ్ గా మారుతుందేమో చూడాలి.