Begin typing your search above and press return to search.
అదిరిపోయే వర్కవుట్స్ తో ఆకట్టుకుంటున్న అల్లు శిరీష్..!
By: Tupaki Desk | 22 Jun 2021 5:48 AM GMTయంగ్ హీరో అల్లు శిరీష్ ఇప్పుడు కళ్లు చెదిరే ఫిజిక్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఫిట్నెస్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన శిరీష్.. జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో పిచ్చెక్కిస్తున్న అల్లు వారబ్బాయి ట్రాన్స్ఫర్మేషన్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక తన కసరత్తులకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతరులను మోటివేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ట్రైనింగ్ డే పేరుతో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియో అప్లోడ్ చేసారు.
ఈ వీడియో ద్వారా వర్కవుట్స్ ఎలా చేయాలి.. ఫిట్ గా ఎలా ఉండాలి అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయి.. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈయన చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి తెలియజేస్తున్నాడు. తొలి వీడియోలో బ్యాక్ వర్కవుట్స్ గురించి చూపిస్తూ.. వామప్ చేసిన తర్వాత ఒక చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడం చూపించాడు. జిమ్ లో డైలీ శిరీష్ ఎంత కష్టపడ్డాడు అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో జిమ్ కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు చూపించారు.
ట్రైనింగ్ డే వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు శిరీష్.. దాంతో పాటు అభిమానుల కోసం మనసులో మాట రాసుకొచ్చారు. ''ఫిట్నెస్ గోల్స్ ను నేను ఇంకా చేరుకోలేదు. 'ట్రైనింగ్ డే' నా ప్రయాణం ద్వారా నాతో పాటు తీసుకునే చిన్న వీడియో సిరీస్. #AStrainingday #backworkout'' అని శిరీష్ పోస్ట్ చేశారు. ఇకపోతే ఈ డిజిటల్ సిరీస్ లో కేవలం జిమ్ ట్రైనింగ్ - ఫిట్నెస్ మాత్రమే కాకుండా యోగా - బాక్సింగ్ కు సంబంధించిన విషయాలు కూడా చూపించబోతున్నారు. శిరీష్ తనకు తాను గోల్స్ సెట్ చేసుకుని ఫిట్నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారని అర్థం అవుతోంది. అంతేకాకుండా తన ఫాలోయర్స్ కోసం కూడా ఇలా వీడియోలు పెట్టి.. ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అల్లు శిరీష్ షేర్ చేసిన ఈ వీడియోకి నెటిజన్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది.