Begin typing your search above and press return to search.
అరెరే అల్లు హీరో అది మిస్ చేశాడా?
By: Tupaki Desk | 7 July 2019 5:46 AM GMTతెలుగులో మార్కెట్ ని బాగా డౌన్ లోకి తెచ్చేసుకున్న హీరో సూర్య కొత్త సినిమా బందోబస్త్ టీజర్ నిన్న విడుదలైంది. టైటిల్ కొంత మాస్ గా అనిపిస్తుంది కానీ ఇది పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. తమిళ్ లో కాప్పన్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా నటిస్తుండగా ఆర్య మరో కీలక పాత్ర చేస్తున్నాడు. కోలీవుడ్ లో దీని మీద క్రేజ్ మాములుగా లేదు.
నిజానికి ఆర్య చేసిన రోల్ ముందు అల్లు శిరీష్ కి ఆఫర్ చేశారట. అప్పట్లో ఇది మీడియాలో కూడా వచ్చింది. సూర్యతో అసోసియేట్ అవుతున్న మెగా హీరో అంటూ కవరేజ్ వచ్చింది. కానీ కొన్ని సీన్లు షూట్ చేశాక శిరీష్ ఆ పాత్రకు సూట్ కాడని అందుకే ఆర్యతో రీప్లేస్ చేశారని చెన్నై సర్కిల్స్ లో కథనాలు వచ్చాయి. కానీ కాల్ షీట్స్ సమస్య వల్ల వదులుకోవాల్సి వచ్చిందని శిరీష్ తర్వాత చెప్పాడు కానీ నిజం పెరుమాళ్ళ కెరుక అనే తరహాలో క్లారిటీ మిస్ అయిపోయింది
ఏదైతేనేం అల్లు శిరీష్ మంచి ఛాన్స్ మిస్ అయిన మాట వాస్తవం. రంగం లాంటి సినిమాతో తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ మూవీ అంటే నటనకు చాలా స్కోప్ ఉంటుంది. కానీ ఇలా చేజారిపోవడం అంటే ఆలోచించాల్సిన విషయమే. గత ఏడాదిన్నర టైంలో శిరీష్ చెసింది ఎబిసిడి ఒక్కటే. అది కూడా తక్కువ బడ్జెట్ లో తీసిన రీమేక్ మూవీ. మరి కాల్ షీట్స్ సమస్య ఎందుకు వచ్చిందో అన్నదే తమిళ మీడియా ప్రశ్న. దీనికి సమాధానం దొరకదు కానీ ఎబిసిడి తర్వాత శిరీష్ ఇంకే సినిమాకు కమిట్ కాలేదు.