Begin typing your search above and press return to search.
ఫైనల్ గా ఒక్క క్షణం కష్టమే
By: Tupaki Desk | 5 Jan 2018 6:00 AM GMTవారసులకు రాజకీయాల్లో ఈజీగా అధికారాన్ని కట్టబెట్టవచ్చని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశ రాజకీయాలు అందుకు ఉదాహరణ. కానీ దానికి దగ్గరగా వుండే సినిమాల్లో మాత్రం వారసత్వం హీరోయిజం అనేది ఇచ్చేది కాదు. టాలెంట్ తో కూడుకున్నది. టాలీవుడ్ లో చాలా వరకు ఆ విధంగా వచ్చిన హీరోలు సక్సెస్ ను భాగానే అందుకున్నారు. గాని కొంత మంది మొదటి అడుగు తప్ప రెండవ అడుగు కరెక్ట్ గా ఉపయోగించుకోవడం లేదు.
అయితే అల్లు వారి హీరో శిరీష్ మాత్రం మొదటి అడుగే కాదు ఎన్ని అడుగులు వేసినా ఇంకా సరైన బ్లాక్ బస్టర్ హిట్టు వరకూ రాలేకపోతున్నాడు. అతను చేసిన సినిమాలన్నీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకోలేదని చెప్పాలి. శ్రీ రస్తూ శుభమస్తు పరశురాం డైరెక్షన్ తో అద్భుతంగా తెరకెక్కించి పర్వాలేదు అనే విధంగా హిట్ అందించాడు. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక్క క్షణం మూవీ మాత్రం కలెక్షన్ పరంగా మొదటి వారానికే కష్టమని అని తేలింది. కొత్త జంట సినిమా మొదటి వారం రూ.6 కోట్ల వరకు షేర్లను అందుకుంటే.. శ్రీ రస్తూ శుభమస్తు 9 కోట్ల వరకు వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక్క క్షణం మాత్రం ఎవరు ఊహించని విధంగా రూ.2.95 కోట్లను మాత్రమే రాబట్టింది. ధియేట్రికల్ రైట్స్ మొత్తంగా 12 కోట్లకు అమ్మడైపోయిన వేళ.. ఇక రికవరీ అనేది లేనట్లే అనుకోవాలి.
ఆయితే సినిమాకు రివ్యూలు బాగానే వచ్చాయి. అలాగే సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేశారు గాని అంతగా సక్సెస్ కాలేదు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా ఫ్రీ రిలీజ్ కు స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. అయితే రిలీజ్ టైమింగ్ కరెక్ట్ కాదేమో అని ట్రేడ్ పండితుల అంచనా.