Begin typing your search above and press return to search.

'గీత గోవిందం' అత‌ను చేసి ఉంటే..

By:  Tupaki Desk   |   28 Aug 2018 1:30 AM GMT
గీత గోవిందం అత‌ను చేసి ఉంటే..
X
ఎవ‌రో చేయాల్సిన సినిమా ఇంకెవ‌రి చేతికో వెళ్ల‌డం మామూలే. అలా వెళ్లిన సినిమా ఫ్లాప్ అయితే హ‌మ్మ‌య్య అనుకుంటారు. బాగా ఆడితే అయ్యో అనుకుంటారు. ఇప్పుడు ‘గీత గోవిందం’ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం చూసి అల్లు శిరీష్ అయ్యో అనే అనుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ‘గీత గోవిందం’ కంటే ముందు తీసిన ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’లో శిరీషే హీరో అన్న సంగతి తెలిసిందే. ప‌ర‌శురామ్ త‌ర్వాతి సినిమాను కూడా ‘గీతా ఆర్ట్స్ లోనే లాక్ చేసిన అల్లు అర‌వింద్.. ‘గీత గోవిందం’ క‌థ‌ను కూడా శిరీష్ తోనే తీయాల‌ని అనుకున్నాడ‌ట‌. కానీ ప‌ర‌శురామ్ మాత్రం వేరే హీరో కావాల‌ని అడిగి.. విజ‌య్ దేవ‌ర‌కొండ పేరును సూచించాడని అనుకుంటున్నారు. ఈ క‌థ‌కు అత‌నే క‌రెక్ట్ అని ప‌ర‌శురామ్ గ‌ట్టిగా చెప్ప‌డంతో అర‌వింద్ కూడా ఓకే అన్నారని టాక్ .

ప‌ర‌శురామ్ ఎంత మంచి నిర్ణ‌యం తీసుకున్నాడ‌న్న‌ది ‘గీత గోవిందం’ రిజ‌ల్ట్ చూస్తే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. కంటెంట్ ప‌రంగా మామూలుగానే అనిపించే ఈ చిత్రం ఇంకే హీరో న‌టించినా ఈ స్థాయి విజ‌యం సాధించేది కాదు పరిశ్రమలో పెద్దలు అనుకుంటున్నారు. అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ కి వ‌చ్చిన సూప‌ర్ క్రేజ్ ఈ చిత్రానికి బాగా ఉప‌యోగ‌ప‌డింది. అలాగే అత‌డి పెర్ఫామెన్స్ కూడా గోవింద్ పాత్ర‌కు బాగా సెట్ట‌యింది. మిగ‌తా విష‌యాలు కూడా క‌లిసొచ్చి సినిమా చాలా పెద్ద హిట్ట‌యింది. ప‌ది కోట్ల లోపు బ‌డ్జెట్ పెడితే రూ.60 కోట్ల షేర్ వ‌స్తోంది. చాలా ఏరియాలో సొంతంగా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల ‘గీతా ఆర్ట్స్’ ఈ చిత్రం ద్వారా రూ.40 కోట్ల దాకా లాభం అందుకుంటున్న‌ట్లు అంచ‌నా. ఒక భారీ చిత్రంతో కూడా ఈ స్థాయి లాభాలు రావు. ఒక‌వేళ శిరీష్ నే పెట్టి ఈ సినిమా తీస్తే ఎంత వ‌చ్చేదో అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మేమీ కాదు.