Begin typing your search above and press return to search.
అల్లు హీరో.. గ్లోబల్ వార్మింగ్ సలహా
By: Tupaki Desk | 18 March 2016 11:30 AM GMTఒకప్పుడు టెక్నికల్ సలహాలు ఇవ్వడంలో అల్లు వారి చిన్నబ్బాయి దిట్ట. ఇప్పుడు కూడా దిట్టనే కాని అలాంటి సలహాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇది వరకు అసలు హీరో కాక మునుపే అల్లు శిరీష్ ట్విట్టర్‌లో రచ్చ లేపేశేవాడు. అప్పుడప్పుడు తనకు ఒళ్ళుమండించిన వారిని బూతులు కూడా తిట్టాడులే.
ఇకపోతే మండుతున్న ఎండలను ఉద్ద్యేశించి ఒక విషయం చెప్పుకొచ్చాడు శిరీష్.. ''ఇప్పటికే 2015 వింటర్.. 115 సంవత్సరాలలో చాలా వేడిగా ఉన్న వింటర్ అని సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. ఇది కేవలం మార్చ్ నెల. కాని అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఎండలోకి రాకుండా ఉండటానికే చూసుకోండి. అలాగే ఎక్కవగా లిక్విడ్స్ సేవిస్తూ.. హైడ్రేటెడ్ గా ఉండండి'' అంటూ సలహా ఇచ్చాడు. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫక్ట్ అంటూ సెలవిచ్చాడు కూడా. నిజమే.. మార్చి నెలకే అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రత టచ్ అయిపోయింది. పైగా హైదరాబాద్ వంటి నగరాల్లో గతంలో ఉన్న ఆ కూలింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు లేదు. అందుకే అందరూ శిరీష్ సలహాను స్వీకరిస్తున్నారు.
ఏదేమైనా సినిమా హీరోలంటే ఎప్పుడూ తమ సినిమాల గురించి.. అలాగే ఇతర హీరోల సినిమాల టీజర్ల గురించి మాత్రమే ప్రస్తావించకుండా ఇలా పదిమందికీ ఉపయోగదాయకమైన సలహాలు ఇవ్వడం కూడా గ్రేటే.