Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కి మనమేం తక్కువ కాదు -శిరీష్
By: Tupaki Desk | 28 Jan 2016 5:47 AM GMTఈవెంట్స్ నిర్వహణ అంటే మన దగ్గర ప్రత్యేకమైన హోస్ట్ లు ఉంటారు. బాలీవుడ్ లో మాదిరిగా స్టార్ హీరోలు, హీరోయిన్లు హోస్ట్ చేసే కల్చర్ మన దగ్గర లేదు. కానీ ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసే ఉద్దేశ్యంతోనే.. ఐఫా ఉత్సవాన్ని తనే హోస్ట్ చేసినట్లు అల్లు శిరీష్ చెబుతున్నాడు. ఈవెంట్ ఆర్గనైజర్లను తనే సంప్రదించానని, వారు ఆనందంగా ఒప్పుకున్నారని అన్నాడు.
'యాక్టర్లు యాంకరింగ్ చేస్తే మన దగ్గర చులకనగా చూస్తారని, ఇలాంటి వాతావరణాన్ని మార్చాలని అనుకున్నా. ఈ కార్యక్రమంలో నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. కెమేరా ముందు యాక్ట్ చేయడం వేరు. లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడ్డం వేరు. అందుకే కొందరు స్క్రిప్ట్ రైటర్స్ తో కలిసి రిహార్సల్స్ కూడా చేశాను. స్టార్లకు ఫోన్ చేసి, వారిని ఫన్నీగా ఉండే ప్రశ్నలు అడుగుతానని, ఫీలవద్దని ముందే చెప్పాను. వారు కూడా అంగీకరించడంతోనే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది.' అంటున్నాడు అల్లు శిరీష్.
ఈ కార్యక్రమం పూర్తయ్యాక.. శిరీష్ లో మిమిక్రీ ట్యాలెంట్ ఉందని అందరికీ తెలిసింది. అందరు హీరోలను మిమిక్రీ చేసి, అబ్బురపరిచాడు ఈ హీరో. కొత్తగా తాను చేసిన ప్రయత్నాన్ని మామయ్య మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహరాజ్ రవితేజ - డైరెక్టర్ హరీష్ శంకర్ లు ఫోన్ చేసి అభినందించనట్లు చెప్పాడు. రెజీనా - నవదీప్ లతో కలిసి అల్లు శిరీష్ నిర్వహించిన ఐఫా ఉత్సవంలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనేక విషయాల్లో మనం బాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోమనే విషయం ఐఫా అవార్డుల వేదిక ప్రూవ్ చేసిందని అల్లు శిరీష్ అంటున్నాడు.