Begin typing your search above and press return to search.

శిరీష్ కి ఆ ప్రొడ్యూసర్ కి మధ్య ఎం జరిగింది?

By:  Tupaki Desk   |   22 Feb 2018 9:23 AM GMT
శిరీష్ కి ఆ ప్రొడ్యూసర్ కి మధ్య ఎం జరిగింది?
X
గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ఒక్క క్షణం మూవీ పేరు తెచ్చినప్పటికి అల్లు శిరీష్ కోరుకున్న కమర్షియల్ బ్రేక్ అయితే ఇవ్వలేకపోయింది. అందుకే తన కొత్త సినిమాల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్న శిరీష్ కు కోరుకోని తలనెప్పి ఒకటి వచ్చి చేరటం బాగా చికాకు పెడుతోందని టాక్. గత ఏడాది మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 1971: బియాండ్ బోర్డర్స్ అనే సినిమాలో శిరీష్ సోల్జర్ చిన్మయి అనే చిన్న క్యామియో రోల్ ఒకటి చేసాడు. అది ఆశించినంత విజయం దక్కించుకోలేదు. ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే హైప్ చూసిన నిర్మాతలు ఎన్వి ప్రసాద్ - టాగోర్ మధు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో హక్కులను కొనుగోలు చేసినట్టు వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి.

ఈ 1971 మూవీ మలయాళంలో గత ఏడాది ఏప్రిల్ లోనే విడుదలయ్యింది. ఫలితం చూసాక వెంటనే దీన్ని డబ్ చేసేందుకు తొందరపడలేదు నిర్మాతలు. కాని హటాత్తుగా గత మూడు రోజులుగా యుద్ధ భూమి పేరుతో ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ పోస్టర్లు - టీజర్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. స్వంతంగా విడుదల చేయడం పట్ల ఆసక్తి లేకపోవడంతో మరో నిర్మాతకు దీని హక్కులు అమ్మేశారని తెలిసింది. దీంతో మెగా ఇమేజ్ ని బేస్ చేసుకుని సినిమాని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో హక్కులు కొన్న కొత్త నిర్మాత పోస్టర్స్ లో శిరీష్ ని హై లైట్ చేసి మోహన్ లాల్ ని తక్కువ చేసి పబ్లిసిటీ చేయటం శిరీష్ కు ఆగ్రహాన్ని కలిగించిందట.

దీంతో వెంటనే నిర్మాత ఎన్వి ప్రసాద్ కు ఫోన్ చేసి అసలు హీరో అయిన మోహన్ లాల్ గారిని పక్కన పెట్టి తన స్టిల్స్ తో సినిమాను ప్రమోట్ చేయటం పట్ల కాస్త గరం గరంగానే నిలదీసినట్టు తెలిసింది. తనకు, మోహన్ లాల్ కు చక్కని సత్సంబంధాలు ఉన్నాయని, యుద్ధభూమి ప్రమోషన్స్ చూసి ఆయన కూడా హర్ట్ అయ్యారని చెప్పాడట. ఇలా చేయటం ఎంత మాత్రం సరికాదన్న శిరీష్ తనది క్యామియో అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం పట్ల గట్టిగానే అడిగినట్టు తెలిసింది. ఇకనైనా అవి మార్చేలా చర్యలు తీసుకోమని సూచించాడట. థర్డ్ పార్టీ కి హక్కులు అమ్మినట్టు తనకు మాట మాత్రం చెప్పకపోవడంతో పాటు ఇలా ప్రమోషన్ మొదలు పెడుతున్నారు అని తెలియకుండా మొదలు పెట్టడం పట్ల శిరీష్ నిర్మాత ఎన్వి ప్రసాద్ అడిగినట్టు టాక్. మరి ఈ పరిణామం తర్వాత యుద్ధభూమి పబ్లిసిటీలో మార్పులు జరుగుతాయేమో చూడాలి.