Begin typing your search above and press return to search.
అల్లు బ్రదర్ రివ్యూ ఇచ్చాడు.. కాని..
By: Tupaki Desk | 3 April 2018 5:08 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫైనల్ గా తన పూర్తి టాలెంట్ ను నిరూపించుకున్నాడు. రంగస్థలం సినిమా ప్రస్తుతం అన్ని తరహా రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా మంచి టాక్ ను కూడా సొంతం చేసుకుంటోంది. గతంలో ఎక్కడో ఒక చోట చరణ్ నటనపై విమర్శలు వచ్చేవి. కానీ ఈ సారి నటుడిగా మెగా పవర్ స్టార్ తన స్థాయిని పెంచుకున్నాడనే చెప్పాలి. సెలబ్రెటీలు కూడా ఎవరి స్టైల్ లో వారు చరణ్ నటన సూపర్బ్ అంటూ సినిమా రివ్యూలను ఇచ్చేస్తున్నారు.
అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు అందరు సినిమా బావుందని కామెంట్ చేశారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం ఆశ్చర్యపరచింది. అయితే ఆలస్యంగా అయినా అల్లు బ్రదర్ శిరీష్ స్పందించాడు. ఎట్టకేలకు ఒక ట్వీట్ తో సినిమా బావుంది. చరణ్ నటన సూపర్బ్ అంటూ రెగ్యులర్ ఫార్మాట్ లోనే కామెంట్ చేశాడు. అందులో కొత్తగా ఏమి లేకపోవడంతో మనోడు ఎక్కడో హార్టయినట్లు ఉన్నాడు అనే టాక్ వస్తోంది. మెగా ఫ్యామిలీతో ఏ సంబంధం లేని వారే పేజీలు పేజీలు రివ్యూలు ఇస్తున్నారు. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సినిమాలో ప్రతి అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్లు శిరిష్ ట్వీట్ లో మాత్రం ఆ ఎనర్జీ కనిపించలేదు. అదే ఇప్పుడు పెద్ద డిస్కషన్ కు తావిచ్చింది.
ఎదో ఫార్మాలిటీకి పెట్టాడా.. లేక తన సినిమాలకు ఎవరు ట్వీట్ చేయడం లేదు.. నేను ఇది చేయడమే ఎక్కువ అన్నట్లు బావించాడా అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా.. మెగా కజిన్స్ అందరూ రంగస్థలం సినిమాకు భారీ ప్రమోషనే చేశారబ్బా!!