Begin typing your search above and press return to search.

గజిని డేస్ గుర్తొచ్చాయి

By:  Tupaki Desk   |   22 Sept 2017 10:37 AM IST
గజిని డేస్ గుర్తొచ్చాయి
X
సౌత్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురగదాస్ కెరీర్ లో అందరికి ఎక్కువగా గుర్తుండేది గజిని సినిమా అనే చెప్పాలి. తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఆ సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సూర్యకి ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యారు. ఇక అదే కథను మురగదాస్ హిందీలో అమిర్ ఖాన్ తో తీసి ఫెమస్ అయ్యాడు. అమిర్ ఖాన్ కి కూడా ఆ సినిమా చాలా బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి.

అయితే ఆ సినిమాను నిర్మించింది మన టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. ఠాగూర్ మధు సహా నిర్మాతగా పని చేశారు. అయితే ఈ సినిమా ద్వారా అమిర్ ఖాన్ అల్లు ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడనే చెప్పాలి. ఇక అల్లు శిరీష్ ఆ సినిమా యూనిట్ లో ఒకడిగా పని చేశాడు. ఫిల్మ్ మేకింగ్ వర్కింగ్ ను చాలా నేర్చుకున్నాడు. అయితే రీసెంట్ గా అల్లు శిరీష్ అప్పుడు తన ఫ్యామిలీతో తో కలిసి అమిర్ తో దిగిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. మై గజినీ డేస్ అంటూ.. అమిర్ ఖాన్ - మురగదాస్ దగ్గర పని చేయడం మరచిపోలేని ఒక మంచి అనుభూతి అని కామెంట్స్ చేశాడు.

ఆ ఫొటోలో అమిర్ ఖాన్ తో పాటు అల్లు వారి కుటుంబం మొత్తం ఉండడం ప్రధాన ఆకర్షణకుగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ గజినీ సినిమాను అల్లు అరవింద్ 45 కోట్లతో తెరకెక్కించగా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ద్వారా నార్త్ లో కూడా గీత ఆర్ట్స్ తన ఉనికిని చాటుకుంది.