Begin typing your search above and press return to search.
స్పీచ్ తో ఆకట్టుకున్న అల్లు శిరీష్..!
By: Tupaki Desk | 9 April 2021 8:50 AM GMTస్టార్ హీరోల సపోర్ట్ తో వారికి ఉన్న ఫాలోయింగ్ ని వాడుకోవడానికి ట్రై చేసే కుర్ర హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. స్టార్ హీరోలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చి మాట్లాడితే చాలు, అతని ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందని.. ఇది సక్సెస్ తో పాటుగా ఫాలోయింగ్ ని కూడా తెచ్చిపెడుతుందని ఆలోచించేవారు లేకపోలేదు. అందుకే సినిమా ఈవెంట్స్ లో ఫ్యాన్స్ ని మెప్పించి తమ వైపుకి తిప్పుకోవడానికి హై వోల్టేజ్ స్పీచ్ లు దంచేస్తుంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. ఇంట్లోనే స్టార్ హీరోలు ఉన్నా కూడా ఆ ఫాలోయింగ్ ని ఉపయోగించుకోడానికి ట్రై చేయరు. తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో యువ హీరో అల్లు శిరీష్ ఒకరు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు శిరీష్. 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' వంటి సినిమాలతో మెప్పించాడు. ఇటీవల 'విలాయటి శరాబ్' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో అలరించాడు. ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్న అల్లు శిరీష్.. తన అన్న బన్నీ బర్త్ డే ఈవెంట్ లో తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. 'ఈ స్టేజీపైకి వచ్చి సినిమా గురించి మాట్లాడాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా మాత్రమే అర్హత ఉంది. కానీ ఇంతమంది గొప్ప వాళ్ల ముందు మాట్లాడటానికి ఇంకా కొన్ని రోజులు టైమ్ పడుతుంది. అది సాధించిన రోజు మా అన్న గురించి నేనే మాట్లాడతాను' అంటూ స్పీచ్ ముగించాడు. బయట హీరోలు కూడా తన అన్న ఇమేజ్ ని వాడుకోవాలని ట్రై చేస్తుంటే.. అల్లు శిరీష్ మాత్రం అలాంటివేమీ చేయకుండా చాలా వినయంగా, విధేయతతో మాట్లాడాడని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.