Begin typing your search above and press return to search.

అల్లు అబ్బాయి తెలుగు సినిమా సత్తా చెప్పాడు

By:  Tupaki Desk   |   18 Jun 2016 9:24 AM GMT
అల్లు అబ్బాయి తెలుగు సినిమా సత్తా చెప్పాడు
X
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ఇప్పుడు కశ్మీర్ లో చక్కర్లు కొడుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు షూటింగ్ కోసం కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ ని ఏరి ఎంపిక చేసుకుని మరీ షూటింగ్ చేస్తున్నాడు. సోలో ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి.. శిరీష్ కి జంటగా నటిస్తుండగా ప్రస్తుతం కశ్మీర్ లో పాటలతో పాటు ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

కశ్మీర్ అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న శిరీష్.. ప్రతీ అడ్ డేట్ ను ట్విట్టర్ లో పెట్టేస్తున్నాడు. సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉండే ఈ కుర్రాడు.. అటు ప్రమోషన్ తో పాటు ఇటు ఫ్యాన్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేసేస్తూ ఉంటాడు. ' కశ్మీర్ షెడ్యూల్ ముగిసింది. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అద్భుతమైన లొకేషన్స్ - విజువల్స్ తో షూటింగ్ చేశాం. ఇక్కడ షూటింగ్ చేస్తున్నపుడు నాకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది' అంటున్నాడు శిరీష్.

'సెట్ మాక్స్-స్టార్ గోల్డ్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యే సినిమాల గురించి తెలుసుకున్నా. కశ్మీర్ కి చాలా ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తారు. ఆ ఛానల్స్ లో ప్రసారమయ్యే తెలుగు టూ హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు స్టార్ హీరోల గురించి చాలామందికి తెలుసు. తెలుగు సినీ పరిశ్రమ ఈ రేంజ్ కి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పాడు శ్రీరస్తు శుభమస్తు హీరో అల్లు శిరీష్.