Begin typing your search above and press return to search.

కాశ్మీర్ లో మెగా క్యాంప్ సల్లాపాలు

By:  Tupaki Desk   |   11 Jun 2016 4:07 PM GMT
కాశ్మీర్ లో మెగా క్యాంప్ సల్లాపాలు
X
కాశ్మీర్.. చాలామంది జనాలకు ఇదో డ్రీమ్ ప్లేస్. గతంలో చాలా సినిమాలను ఇక్కడే తెరకెక్కించేవారు. అవుట్ డోర్ సాంగ్ అంటే.. కాశ్మీర్ కే ప్రాధాన్యం. ఇప్పుడంటే స్విట్జర్లాండ్ - న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా అంటూ అన్ని దేశాలు చుట్టేస్తున్నారు కానీ.. కాశ్మీర్ అందాలు వీటికి సరిసాటిగానే ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ అన్నీ పాతగా కనిపిస్తున్నాయో ఏమో.. మళ్లీ ఇప్పుడు కాశ్మీర్ లో షూటింగ్ కి క్యూ కట్టేస్తున్నాయి సినిమాలు.

రీసెంట్ గా ఒక అమ్మాయి తప్ప సినిమా కోసం కాశ్మీర్ లో సాంగ్ షూట్ చేశారు. కాశ్మీర్ ని అందాలను డ్రోన్ కెమెరాలతో బంధించి మరీ విజువలైజ్ చేశారు. దీనికి ముందు ఎవడే సుబ్రమణ్యం అయితే.. సగానికి పైగా సినిమా కాశ్మీర్ లోనే సాగుతుంది. ఇప్పుడు అల్లు శిరీష్ కూడా శ్రీరస్తు.. శుభమస్తు చిత్రం కోసం కశ్మీర్ వెళ్లిపోయాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి అక్కడ పాటలు పాడుకోబోతున్నాడు శిరీష్. 'హెలా కాశ్మీర్ లో ఎంతో అందమైన సోనామార్గ్' అంటూ ఓ ఫోటో కూడా ట్వీట్ చేశాడు. లావణ్య కూడా 'ఇక్కడనుంచి వెనక్కు రావాలా' అని ప్రశ్నిస్తూ.. కశ్మీర్ అందాలను ఓ ఫోటో తీసింది.

రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ టూర్ వెళ్లాకే.. టర్కీ వెళ్లాడు. వీరంతా కాకుండా కూడా రామ్ చరణ్ కూడా త్వరలో కాశ్మీర్ కి వెళ్లబోతున్నాడు. ధృవ చిత్రం కోసం మిలటరీ ట్రైనింగ్ సీన్స్ తో పాటు.. కొన్ని పాటలను కూడా ఇక్కడే చిత్రీకరించనున్నాడు. మొత్తానికి కాశ్మీర్ అందాలను మెగా హీరోలు వరుసగా కెమేరాలో బంధించేసి చూపిస్తుండడం విశేషమే.