Begin typing your search above and press return to search.

థమన్ దెబ్బకి అల్లు సింగర్ దిగాడు

By:  Tupaki Desk   |   17 Aug 2016 11:55 AM GMT
థమన్ దెబ్బకి అల్లు సింగర్ దిగాడు
X
ఎవరినైనా కూడా సింగర్ అని అనిపిస్తాడు థమన్. ఎలాంటి గొంతుతో పాడేసినా కూడా.. ఆ పాటకు వెంటనే వాయిస్ సప్రెషన్ ప్లగిన్ ఒకటి తగిలించి.. దానిని సెక్సీ వాయిస్ లా మార్చేసి.. జనాలకు వినసొంపుగా తయారు చేస్తాడు. కాకపోతే వచ్చిన చిక్కేటంటే.. ఆ పాట విన్నాక ఇది పాడింది ఎవరబ్బా అంటూ తెలుసుకోవడానికి మనకు టైమ్ పడుతుంది.

ఆ విధంగా ఇప్పటివరకు ధనుష్‌ - శింబు - జూ.ఎన్టీఆర్ - రవితేజ.. అబ్బో అందరినీ సింగర్లను చేశాడు. వీళ్లందరినీ చేశాక ఇప్పుడు అల్లు వారి ఫ్యామిలీ నుండి కూడా మనోడికి ఒక సింగర్ ను ఇంట్రొడ్యూస్ చేయాలని అనిపించిందేమో కాని.. వెంటనే చేసేశాడు. అయితే ''శ్రీరస్తు శుభమస్తు'' సినిమాలో ఈ పాటను పెట్టలేదని కాని.. 'అను అను' అంటూ సాగే పాటకు ఆల్టర్నేట్ వెర్షన్ ఒకటి శిరీష్‌ తో పాడించి నెట్లో రిలీజ్ చేశారు. ఇక ఎప్పటిలాగానే పాటలో మాటలు వచ్చినప్పుడు శిరీష్‌ వాయిస్ అనుకుంటాం కాని.. మిగిలినదంతా మాత్రం ఎవరో పాడుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. సింగర్ వాయిస్ ను థమన్ ప్రతిభ అలా డామినేట్ చేసింది మరి.

అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి ఒక సింగింగ్ సెన్సేషన్ గా శిరీష్‌ లైన్లోకి రావడం మరి అభిమానులకు ఆనందంగానే ఉంది. గతంలో మెగా ఫ్యామిలీ విషయంలో చూసుకుంటే చిరంజీవి - పవన్ ఇద్దరూ పాడేశారు. అది సంగతి.