Begin typing your search above and press return to search.
అప్పుడు జాన్వీ కపూర్.. ఇప్పుడు అల్లు స్నేహా రెడ్డి..!
By: Tupaki Desk | 21 Nov 2022 4:18 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో బన్నీకి ఎంత క్రేజ్ ఉంటుందో.. ఆమెకి కూడా అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో స్నేహ రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన భర్త అల్లు అర్జున్ తో కలిసి ఫ్రెండ్ పెళ్లి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ సెలబ్రిటీ కపుల్ తీసుకున్న కొన్ని ఫోటోలు కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అందులో స్నేహా ఫోటో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది.
అల్లు వారి కోడలు ధరించిన డిజైనింగ్ దుస్తులకు గతంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వేసుకున్న డ్రెస్ డిజైన్ ఒకేలా ఉండటంతో నెటిజన్లు ఇద్దరినీ కంపేర్ చేస్తున్నారు. స్టార్ హీరో భార్య మరియు స్టార్ హీరోయిన్ లలో ఎవరికి ఆ డ్రెస్ బాగా సూట్ అయింది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్నేహ రెడ్డి ధరించిన దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా తన 'ది ట్రీ ఆఫ్ లైఫ్' సేకరణలో భాగంగా రూపొందించారని తెలుస్తోంది. ఇదే డిజైనింగ్ వేర్ ను జాన్వీ కపూర్ తాను నటించిన 'గుడ్ లక్ జెర్రీ' సినిమా ప్రమోషన్స్ సమయంలో ధరించింది. ఇప్పుడు అదే గౌనులో బన్నీ భార్య కనిపించడంతో నెట్టింట వైరల్ గా మారింది.
జాన్వీ - స్నేహా ధరించిన డ్రెస్సుల్లో ఆర్ట్ వర్క్ మరియు నెక్ ప్యాటర్న్ కలర్ పరంగా కాస్త తేడా కనిపించినా.. ఈ రెండూ దాదాపుగా ఒకేలా కనిపిస్తున్నాయి. హీరోయిన్ గా రాణిస్తున్న జాన్వీ కపూర్ కు తన శరీరాకృతికి తగ్గట్టుగా ఏ విధమైన దుస్తులను ఎంచుకోవాలి.. ఎలాంటి డ్రెస్సులు తన అందాన్ని రెట్టింపు చేస్తాయో బాగా తెలుసు.
ఇప్పుడు ఈ డిజైనింగ్ దుస్తుల్లోనూ జాన్వీ ఎంతో అందంగా కనిపించింది. మరోవైపు హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందంతో ఉండే అల్లు స్నేహ రెడ్డి.. ఈ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి దుస్తులను పోల్చి.. స్నేహ స్టైలింగ్ ఆకట్టుకుంటోందని సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.
నిజానికి స్నేహ - జాన్వీ ఇద్దరూ తమదైన రీతిలో అద్భుతంగా కనిపిస్తున్నారు. తమకు సరిపోయే దుస్తులను ఎంచుకొని అందరినీ ఆకట్టుకున్నారు. ఒకే విధమైన డ్రెస్ లో ఉన్నప్పటికీ.. ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో పోలికలు పెట్టాల్సిన అవసరం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.