Begin typing your search above and press return to search.
బాబోయ్.. హీరోయిన్స్ కూడా ఇలా చేయరు మేడం
By: Tupaki Desk | 9 July 2021 7:30 AM GMTహీరోయిన్స్ తమ ఫిజిక్ మరియు బ్యూటీని కాపాడుకుంటే తప్ప ఇండస్ట్రీలో కొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉండదు. అందుకే ఫిజిక్ ను కాపాడుకునేందుకు మరింత అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ చాలా కష్టపడుతారు. వారి వర్కౌట్ వీడియోలు చూసిన సమయంలో కొన్ని సార్లు అవాక్కు అయ్యేలా ఉంటాయి. మరీ ఇంతగా హీరోయిన్స్ కూడా కష్టపడుతారా అనిపిస్తుంది. అలాంటిది హీరోయిన్స్ కంటే కూడా అధికంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్టైలిష్ స్నేహా రెడ్డి కష్టపడుతున్నారు. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయిన స్నేహా రెడ్డి రెగ్యులర్ గా వర్కౌట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను కలిగి ఉంటారు.
హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఆమె అందంగా కనిపిస్తూ ఉంటారు. అభిమానులు ఏదో ఒక సినిమాలో స్నేహారెడ్డితో బన్నీని చూడాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అంత అందంగా మంచి పర్సనాలిటీతో ఉండే స్నేహా రెడ్డి రహస్యం ఏంటో తెలిసి పోయింది. ఆ అమె అందంకు చక్కని ఫిజిక్ కు కారణం ఆమె చేసే అత్యంత కష్టమైన వర్కౌట్స్ అంటూ తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ ఆమె రెగ్యులర్ గా ఎంతగా కష్టపడుతుందో చెప్పనే చెబుతోంది.
ఇలాంటి ఒక కష్టమైన ఫీట్ చేయాలంటే ఒక్క రోజు రెండు రోజులు ప్రాక్టీస్ చేసిన వారికి అస్సలు రాదు. కనుక స్నేహా సుదీర్ఘ కాలంగానే ఇలాంటి వర్కౌట్స్ చేస్తుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు మాత్రం ఈ ఫొటోకు మీ కష్టంకు సెల్యూట్ మేడం.. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో ఫిజిక్ కోసం కష్టపడుతూ ఉండరు. మీరు మీ ఆరోగ్యంపై చూపిస్తున్న శ్రద్దకు నిజంగా అభినందనలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయాలు చూసుకుంటూ స్నేహా ఇలా వర్కౌట్స్ చేయడం అంటే నిజంగా అభినందనీయం.