Begin typing your search above and press return to search.
'పుష్ప 2' షూటింగ్ తో 'అల్లు స్టూడియో' ప్రారంభం..? గెస్టుగా మెగాస్టార్..?
By: Tupaki Desk | 25 Sep 2022 3:49 AM GMTఅల్లు ఫ్యామిలీ హైదరాబాద్ లో ఓ సినీ స్టూడియో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. 'అల్లు స్టూడియో' పేరుతో లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని రెండేళ్ల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన చేశారు. గండిపేట ప్రాంతంలోని తమ భూమిలో శంకుస్థాపన కూడా చేశారు. అయితే తాజాగా ఈ స్టూడియోకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ చేపట్టిన 'అల్లు స్టూడియోస్' నిర్మాణం పూర్తయిందట. అంతేకాదు ఈ స్టూడియోని ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారట. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన ఈ స్టూడియోస్ ని ఘనంగా ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో 'అల్లు' స్టూడియో లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అలానే ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభిస్తారని వినికిడి. దీనికి మెగా ఫ్యామిలీతో పాటుగా అల్లు ఫ్యామిలీ సభ్యులు అంతా హాజరవుతారని అంటున్నారు.
ఇకపోతే 'అల్లు' స్టూడియోలో చిత్రీకరించబడే మొదటి సినిమా అల్లు అర్జున్ నటించనున్న ''పుష్ప: ది రూల్'' అవుతుందని నివేదికలు పేర్కొన్నాయి. అందుకోసమే ఇప్పటి వరకూ సుకుమార్ అండ్ టీమ్ వేచి ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా, ఫిల్మ్ మేకింగ్ కు అవసరమైన అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో 10 ఎకరాల స్థలంలో విలాసవంతమైన 'అల్లు స్టూడియో' ని నిర్మించారు. సినిమాలతో పాటుగా వివిధ వెబ్ సిరీసుల నిర్మాణం కోసం ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు రెండు అంతస్తులు లీజుకు ఇవ్వబడ్డాయని టాక్.
అల్లు స్టూడియోస్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా కనెక్ట్ చేయబడినందున.. అందరికీ అందుబాటులో ఉంటుంది. స్టూడియో ఆవరణలోకి బయటి వ్యక్తులను అనుమతించకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అరవింద్ తో పాటుగా ఆయన కుమారులు బాబీ - అల్లు అర్జున్ - శిరీష్ కలిసి ఈ స్టూడియో కార్యకలాపాలను చూసుకోనున్నారు.
టాలీవుడ్ లో ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి 'అన్నపూర్ణ స్టూడియో'.. దగ్గుబాటి కుటుంబానికి 'రామానాయుడు స్టూడియో'.. నందమూరి ఫ్యామిలీకి చెందిన 'రామకృష్ణ స్టూడియోస్' ఉన్నాయి. తిరుపతిలో మంచు ఫ్యామిలీ కూడా స్టూడియో కట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అల్లు కుటుంబం కూడా స్టూడియోని నిర్మించింది.
అల్లు అరవింద్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. మరోవైపు అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని అల్లు అర్జున్ మరియు శిరీష్ కొనసాగిస్తున్నారు. అలానే బాబీ కూడా నిర్మాతగా మారారు. మరికొన్ని రోజుల్లో అల్లు నాలుగో తరం నుంచి అర్హ తెరంగేట్రం చేయబోతోంది.