Begin typing your search above and press return to search.
అల్లూ వారి వెబ్ సిరీస్ .. ఇదీ సంగతి
By: Tupaki Desk | 5 Nov 2019 4:32 AM GMTప్రస్తుతం వెబ్ సిరీస్ లదే హవా. పరిమిత బడ్జెట్ లోనే రిస్క్ లేకుండా సంపాదించే అవకాశం ఉన్న ప్లాట్ ఫాంగా పాపులరవుతోంది. నెట్ ప్లిక్స్.. అమోజాన్ లాంటి సంస్థలు వెబ్ సిరీస్ లకు పెద్ద పీట వేసి స్మార్ట్ యుగాన్ని యువతరం ముందుకు తీసుకెళ్తున్నాయి. తత్ఫలితంగా ఔత్సాహికుల ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి వేదిక దొరికినట్లయ్యింది. ప్రస్తుతం సినిమాల కన్నా ఎక్కువ డిమాండ్ వెబ్ సిరీస్ లకే ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ కూడా ఓటీటీ వేదికపై సత్తా చాటే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ బిజినెస్ లోకి దిగుతున్నారు.
ఉత్తరాది కంటెంట్ తరహాలోనే అరవింద్ తొలి వెబ్ సిరీస్ స్టోరీగా అడల్ట్ జానర్ నే ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇందులో రైటర్ వైవ హర్ష.. హాట్ బ్యూటీ సంజన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యూత్ టార్గెట్ గానే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని తెలుస్తోంది. బూతు డైలాగులు.. జోకులకు మసలా దట్టించి బోర్డర్ దాటుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు ఓ కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆరు నెలలుగా అల్లు వారి వెబ్ సిరీస్ కి సంబంధించిన పనులు సాగుతున్నాయి. ఓటీటీ వేదికను విజయవంతం చేసే పనిని అల్లు శిరీష్ కి అప్పజెప్పారన్న సమాచారం ఉంది. ఓటీటీ ప్రణాళిక.. పనుల్ని పర్యవేక్షించేందుకు శిరీష్ జూబ్లీహిల్స్ లోని కార్యాలయానికి వెళుతున్నారు. అల్లు అరవింద్ క్రియేటివ్ డిపార్ట్ మెంట్ ని.. శిరీష్ టెక్నికల్ డిపార్ట్ మెంట్ ని హ్యాండిల్ చేస్తున్నారట.