Begin typing your search above and press return to search.
లావణ్యకు ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడో..
By: Tupaki Desk | 9 Aug 2016 11:03 AM GMTకొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అందులో పని చేసిన కొందరు నటీనటులకు మంచి పేరొస్తుంది. ‘అందాల రాక్షసి’ విషయంలో అదే జరిగింది. ఆ సినిమా ఆడకపోయినా.. ప్రధాన పాత్రలు చేసిన ముగ్గురికీ చాలా మంచి పేరొచ్చింది. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి అయితే ఈ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో తిష్ట వేసుకుకూర్చుంది. ప్రత్యేకమైన అందం.. నటనతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ.. ఏడాది నుంచి యమ స్పీడు మీదుంది లావణ్య. భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న లావణ్య.. లేటెస్టుగా ‘శ్రీరస్తు శుభమస్తు’తో మరో హిట్ ఖాతాలో వేసుకోవడమే కాదు.. తన అందం అభినయంతో మెప్పించింది.
ఈ సినిమా విషయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ లావణ్య త్రిపాఠికి భలే కాంప్లిమెంట్ ఇచ్చాడు. మామూలుగా బన్నీ భార్య స్నేహకు ఏ హీరోయిన్ కూడా నచ్చదట. ఇప్పటిదాకా ఏ హీరోయిన్ కూ ఆమె కాంప్లిమెంట్ ఇవ్వలేదట. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తన భార్యకు భలేగా నచ్చేసిందని చెప్పాడు బన్నీ. బహుశా నాతో ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిందేమో తెలియదు అంటూనే.. తన భార్యకు నచ్చిందంటే ఇక ప్రతి ఒక్కరికీ ఆ అమ్మాయి అంటే ఇష్టమని తనకు అర్థమైందని.. తనకు కూడా లావణ్య మీద చాలా మంచి ఒపీనియన్ ఉందని బన్నీ చెప్పాడు. ఇంతకుముందు తన తమ్ముడితో చేసిన రెజీనా విషయంలోనూ ఇలాగే మాట్లాడాడు బన్నీ. ఇప్పుడు లావణ్య వంతు. ఇలా కాంప్లిమెంట్ ఇవ్వడమేనా.. లేక స్టార్ హీరోలతో చేయాలని తపిస్తున్న ఈ హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చేదేమైనా ఉందా?