Begin typing your search above and press return to search.
టైటిల్ సాంగ్: అల్లుడితో నభా మాస్ స్టెప్స్ అదుర్స్
By: Tupaki Desk | 10 Jan 2021 10:39 AM GMTఅల్లుడు శీనుగా పరిచయమై ఆ తర్వాత మాస్ యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో సత్తా చాటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతడు మరో మాస్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీలో మాసిజం ఏ రేంజులో ఉంటుందో ఊహించడం అంత కష్టం కాదేమో!
బెల్లంకొండ శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `అల్లుడు అదుర్స్` జనవరి 15న థియేటర్లలో రిలీజవుతోంది. తాజాగా ఈ చిత్రానికి ప్రమోషన్లు జోరందుకున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనవైన మాస్ బాణీలతో యువతరంలో హీట్ పెంచుతున్నారు. ఇప్పటికే మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ ల జాబితాలో నిలిచాయి.
తాజాగా మూడవ పాట రిలీజైంది. బెల్లంకొండ -నభా నటేష్ జంటపై అత్యంత ఖరీదైన సెట్లలో చిత్రీకరించిన విజువల్ రిచ్ టైటిల్ సాంగ్ ఇది. DSP అదిరిపోయే పెప్పీ మాస్ నంబర్ ని అందించారనే చెప్పాలి. శ్రీను మాస్ స్టెప్పుల్లో ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా నభా నటేష్ అంతే కిర్రాక్ స్టెప్పులతో కట్టిపడేస్తోంది. హైపిచ్ లో ఉన్న ఈ సాంగ్ ని గాయకులు జస్ ప్రీత్ జేజ్ - వైష్ణవి ఒకరితో ఒకరు పోటీపడుతూ ఆలపించారు. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఈ పాటలోనే కొరియోగ్రాఫర్ల జోష్ ని మేకింగ్ షాట్లను ఆవిష్కరించారు. వీటన్నిటికీ మించి ఆ విజువల్ రిచ్ సెట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లుడు శీను మొదలు బెల్లంకొండ సినిమాల్లో పాటల్లో ఈ తరహా రిచ్ సెట్స్ విషయంలో రాజీ అన్నదే లేదు. కచ్ఛితంగా క్రియేటివ్ విజువల్ బ్రిలియన్సీతో సెట్స్ ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు తాజా సాంగ్ లోనూ సెట్స్ క్వాలిటీ రిచ్ నెస్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీలో ఈ సాంగ్ విజువల్ గానూ ప్రత్యేక ఆకర్షణతో అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.