Begin typing your search above and press return to search.

'అల్లూరి' వీడియో: నీ సాహసమే గర్జించును కదరా..!

By:  Tupaki Desk   |   21 Sep 2022 2:55 PM GMT
అల్లూరి వీడియో: నీ సాహసమే గర్జించును కదరా..!
X
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాలకు విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న హీరో శ్రీ విష్ణు. గతేడాది 'రాజ రాజ చోర' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు ''అల్లూరి'' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు.

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ‘నిజాయితీకి మారుపేరు’ అనే ట్యాగ్‌ లైన్ తో ''అల్లూరి'' సినిమా తెరకెక్కింది. ఇందులో పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నాడు. అతను కెరీర్‌ లో తొలిసారిగా ఖాకీ ధరించి లాఠీ పట్టడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే అల్లూరి సినిమాకు సంబంధించిన పోస్టర్స్ - టీజర్లు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అలానే నాని ఆవిష్కరించిన థియేట్రికల్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన తర్వాత ఈ సినిమా చుట్టూ కావాల్సినంత సందడి నెలకొంది.

''అల్లూరి'' చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు. రిలీజ్ డే వరకూ రెస్ట్ లేకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేసిన టీమ్.. వరుస ఇంటర్వ్యూలతో హల్ చల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మేకింగ్ వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియాలో వదిలింది.

'భగ భగ మండుతూ.. నిప్పులే చిమ్ముతూ.. నిషిదంతా చీల్చుతూ కదిలాడీ చంద్రుడే..' అంటూ శంకర్ మహదేవన్ పాడిన ఓ పాట నేపథ్యంలో ఈ మేకింగ్ వీడియోని చూపించారు. 'అల్లూరి' సినిమా కోసం శ్రీవిష్ణు అండ్ టీమ్ ఎంతగా కష్టపడ్డారు అనేది ఇందులో చూడొచ్చు. మరి ఈ శ్రమకు తగిన ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

కాగా, అల్లూరి అనే ఫిక్షనల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ గా వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందులో శ్రీవిష్ణు సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. సుమన్ కీలక పాత్ర పోషించగా.. తనికెళ్ల భరణి - మధుసూధన్ రావు - ప్రమోదిని - రాజా రవీంద్ర - పృధ్వీ రాజ్ - రవివర్మ - జయవాణి - వాసు ఇంటూరి - జయవాణి - వెన్నెల రామారావు - శ్రీనివాస్ వడ్లమాని ఇతర పాత్రల్లో నటించారు.

''అల్లూరి'' చిత్రాన్ని బెక్కం బబిత సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించగా.. వైటల్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.