Begin typing your search above and press return to search.

అల్లూరి వర్సెస్ శ్రీ విష్ణు... భలేగా ఉందే ప్రమోషన్‌ ఇంటర్వ్యూ

By:  Tupaki Desk   |   21 Sep 2022 7:36 AM GMT
అల్లూరి వర్సెస్ శ్రీ విష్ణు... భలేగా ఉందే ప్రమోషన్‌ ఇంటర్వ్యూ
X
శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అల్లూరి ప్రమోషన్ కార్యక్రమాలు అంతకు మించి అన్నట్లుగా జరుగుతున్నాయి. రెగ్యులర్ ఇంటర్వ్యూలు.. ప్రెస్ మీట్ లు అన్నట్లుగా కాకుండా ఈ సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా శ్రీ విష్ణు డబుల్‌ యాక్షన్ ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఇలాంటి తరహా ఇంటర్వ్యూలు ఒకటి రెండు చూశాం. కానీ ఈ మధ్య సోషల్‌ మీడియా పరిధి మరింత ఎక్కువ అవ్వడంతో ఈ ఇంటర్వ్యూ చాలా వైరల్‌ అవుతోంది. పెద్ద ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయడం కంటే ఇలా విభిన్నంగా ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు దక్కడం ఖాయం అంటున్నారు.

అల్లూరి తో శ్రీవిష్ణు అన్నట్లుగా ఇంటర్వ్యూ సాగింది. ప్రశ్న ఒక యాంకర్ గా శ్రీ విష్ణు పశ్నిస్తూ ఉంటే ఎదురుగా ఉండే అల్లూరి పాత్ర పోషించిన శ్రీ విష్ణు సమాధానం ను అల్లూరి మాదిరిగా చెప్పడం జరిగింది.

ఈ ఇంటర్వ్యూ కాన్సెప్ట్‌ కొత్తది కాకున్నా కూడా భలేగా ఉందంటూ కొందరు ప్రమోషన్ చేస్తున్న తీరును అభినందిస్తున్నారు.

విభిన్నమైన సినిమాలతో.. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే శ్రీ విష్ణు ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు కమర్షియల్‌ గా సక్సెస్ ని అందిస్తుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.