Begin typing your search above and press return to search.
బాలయ్యలో ఆ ఎనర్జీ చాలా ఇష్టం..!
By: Tupaki Desk | 31 Oct 2022 4:30 AM GMTఅల్లు ఫ్యామిలీ నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో అల్లు శిరీష్. కొన్నాళ్లు కెరియర్ గ్యాప్ ఇచ్చిన ఇతను లేటెస్ట్ గా ఊర్వశివో రాక్షసివో సినిమాతో వస్తున్నారు. రాకేశ్ శశి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో అల్లు శిరీశ్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య ఫ్యాన్స్ కి తన శ్రేయోభిలాషులకు.. సినీ అభిమానులకు థ్యాంక్స్ అని చెబుతూ స్పీచ్ ప్రారంభించాడు అల్లు హీరో శిరీశ్.
రాకేశ్ శశి ఇంతకుముందు రెండు సినిమాలు తీశాడు. మూడేళ్లుగా అతనితో పరిచయం ఉంది. అతని గురించి చెప్పాలంటే పని రాక్షసుడు.. పర్ఫెక్షనిస్ట్.. డైరక్టర్ గా అది గొప్ప లక్షణం అని అన్నారు. అతనితో పనిచేయడం ఓ గొప్ప ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చిందని అన్నారు అల్లు శిరీష్. మ్యూజిక్ డైరక్టర్ అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనూప్ తో కొన్నాళుగా చేయాలని అనుకుంటున్నా ఫైనల్ గా ఈ సినిమా కోసం ఒక సాంగ్ ఇచ్చారు. సినిమా కెమెరామెన్ చాలా బాగా చేశారు. ఎడిటింగ్ టైం లో చూస్తున్నప్పుడు పర్లేదు మనం కూడా బాగానే ఉన్నామని అనుకునేలా చేశారని అన్నారు.
ఇక సినిమాలో వెన్నెల కిశోర్, సునీల్ గారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారని చెప్పారు. సినిమా ఎలా ఉండబోతుందో టీజర్, ట్రైలర్ లో చూశారు. నవంబర్ 4న సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి. నాన్నతో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు చేశాను. రెండు హిట్లు అయ్యాయి. ఇది 3వ సినిమా ఇది కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.
ఈ కథ ఇచ్చిన తమ్మారెడ్డి గారికి థ్యాంక్స్. హీరోయిన్ అను చాలా బాగా చేసింది తనలో ఉన్న ఆర్టిస్ట్ ఈ సినిమాలో బయటకు వచ్చింది. తన గురించి ఎక్కువగా మాట్లాడితే మీమర్స్ తనని ఏసుకుంటారు. అందుకే సింపుల్ గా చెప్పాలంటే మేడం సార్ మేడం అంతే అని అన్నారు అల్లు శిరీష్.
ఎంతో మాట్లాడాలని ఉన్నా ఎదురుగా నట సింహం బాలయ్య ని చూసి సగం మర్చిపోయా.. బాలకృష్ణ గారు ఈ వేడుకకి రావడం అద్భుతంగా ఉంది. బాలయ్య ఎనర్జీ గురించి అల్లు శిరీశ్ చెబుతూ రెండు సందర్భాల్లో ఆయన ఎనర్జీ ఏ రేంజ్ లో ఉందో చెప్పారు. అందులో ఒకటి సుస్మిత మ్యారేజ్ టైం లో ఆయనే మొదట వచ్చి ఆ సంగీత్ లో మా అందరితో సమానంగా అదరగొట్టారు. మరోసారి చిరంజీవి గారి 60వ బర్త్ డే బాష్ లో కూడా అందరికంటే ముందుగా వచ్చి రాత్రి 3 గంటల వరకు అదే ఎనర్జీతో ఉన్నారు.
మేమంతా అవుట్ అయినా ఆయన మాత్రం అప్పటికి కూడా అంతే ఎనర్జీతో ఉన్నారు. బాలయ్య గారు మీరు ఇలానే నిత్య యవ్వనంగా ఉండాలని కోరుతున్నా. మీ వయసు ఎంతో తెలియదు కానీ పాతికేళ్ల కుర్రాడిలా ఉండే మీ ఎనర్జీ సూపర్.. ఈ సినిమాని దీవించడానికి వచ్చిన మీకు నా కృతజ్ఞతలు అని అన్నారు అల్లు శిరీశ్. ప్రేక్షకులంతా సైలెంట్ గా ఉన్నారంటే విషయం నాకు అర్ధమైంది.. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ వేదిక మీదకి బాలయ్య బాబుని ఆహ్వానించాడు అల్లు శిరీష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.