Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసులో సల్మాన్ పేరే లేదట
By: Tupaki Desk | 16 July 2020 10:10 AM GMTబాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుశాంత్ వంటి వారిని ఎదగకుండా చేస్తున్న వారు చాలా మంది ఉన్నారని వారిలో సల్మాన్ ఖాన్ కూడా ఒక్కరు అంటూ నెట్టింట కొందరు తీవ్రమైన విమర్శలు చేశారు. సల్మాన్ ఖాన్ పై నెటిజన్స్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పేరును సుశాంత్ కేసు విచారణలో చేర్చినట్లుగా వార్తలు వచ్చాయి.
సుశాంత్ ఆత్మహత్య కేసును విచారణ జరుపుతున్న టీం త్వరలో సల్మాన్ ఖాన్ ను ప్రశ్నించేందుకు సిద్దం అయ్యిందని అందుకు సంబంధించి సమన్లు కూడా జారీ చేయడం జరిగిందని బాలీవుడ్ కు చెందిన మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ కూడా పుకార్లే అంటూ తేలిపోయింది. సుశాంత్ కేసును పరిశీలిస్తున్న ఒక ఉన్నతాధికారి సల్మాన్ పేరు అసలు ఆ కేసులో లేనే లేదని ఆయనకు సుశాంత్ ఆత్మహత్యకు సంబంధం లేదంటూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఆరోపణలు చేసినంత మాత్రాన మేము సల్మాన్ ను ప్రశ్నించబోవడం లేదని పేర్కొన్నాడు.
సల్మాన్ ఖాన్ గతంలో సుశాంత్ కమిట్ అయిన రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ అయ్యేందుకు తెర వెనుక మంతనాలు జరిపాడు అనేది కొందరి వాదన. సుశాంత్ కెరీర్ లో చాలా సినిమాలను కోల్పోయాడు. అందులో కొన్ని సినిమాలు సల్మాన్ వల్ల కూడా కోల్పోవడం వల్ల ఆయన్ను పోలీసులు విచారించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. కాని పోలీసులు మాత్రం సల్మాన్ కు ఈ కేసుకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.