Begin typing your search above and press return to search.
రేప్ చేశావంటే.. ఎలా స్పందించాడో చూడండి
By: Tupaki Desk | 10 Oct 2018 10:07 AM GMTమి టు.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే కాక వివిధ రంగాల్ని షేక్ చేసేస్తున్న క్యాంపైనింగ్ ఇది. ముఖ్యంగా సినీ.. టీవీ పరిశ్రమల్లో చాలా ఏళ్ల పాటు మౌనంగా మగాళ్ల అరాచకాల్ని భరించిన అమ్మాయిలు.. ఇప్పుడు గళం విప్పుతున్నారు. తనూశ్రీ దత్తా.. ఆశా శైనీ.. చిన్మయి లాంటి వాళ్లు వెల్లడించిన విషయాలు చూసి జనాలు విస్తుబోతున్నారు. తాజాగా రచయిత్రి వింటా నందా కూడా సంచలన ఆరోపణలతో బయటికి వచ్చింది. ప్రముఖ టీవీ నటుడు అలోక్ నాథ్.. చాలా ఏళ్ల కిందట తనపై అత్యాచారం జరిపాడని ఆమె ఆరోపించింది. తనకు మద్యం తాగించి బలవంతంగా అతను రేప్ చేశాడని ఆమె పేర్కొంది. పెద్ద మనిషిగా చెలామణీ అయ్యే అలోక్ నాథ్.. ఇంకా చాలామంది మహిళల్ని లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. దీనిపై సినీ.. టీవీ ఆర్టిస్టుల సంఘం అలోక్ కు నోటీసులు జారీ చేసింది.
ఐతే ఈ ఆరోపణలపై అలోక్ నాథ్ స్పందించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తే ఖండించాలి కానీ.. అలోక్ చాలా వ్యంగ్యంగా స్పందించడం జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ‘‘ఈ వ్యాఖ్యలను నేను ఖండించవచ్చు. లేదంటే అంగీకరించవచ్చు. అత్యాచారం జరిగి ఉండొచ్చు. కానీ వేరేవెరో చేసి ఉండొచ్చు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే వ్యవహారం మరింత విస్తరిస్తుంది. ఆమె ఒకానొక సమయంలో నాకు మంచి స్నేహితురాలు. ఇప్పుడే పెద్ద సమస్యగా మారింది. ఆమె ఆరోపణలకు స్పందించడం పిచ్చి చర్యే అవుతుంది. ప్రస్తుతం ప్రపంచం ఎలా తయారైందంటే.. ఆడవాళ్లు ఏది చెబితే అది నమ్ముతున్నారు. వారు మాట్లాడేది అబద్ధమైనా పరిగణనలోకి తీసుకుంటున్నారు’’ అని అలోక్ అన్నాడు. ఐతే మిగతా వ్యాఖ్యల సంగతలా ఉంచితే.. ‘అత్యాచారం జరిగి ఉండొచ్చు. వేరెవరో చేసి ఉండొచ్చు’ అనే మాట అలోక్ అహంకారానికి నిదర్శనమంటూ ఆయన్ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.