Begin typing your search above and press return to search.
ఆల్ఫా ట్రైలర్: భూమ్మీద ఆత్మలు ఎందుకు నివశిస్తాయి?
By: Tupaki Desk | 9 Sep 2021 6:32 AM GMTహారర్ థ్రిల్లర్ కథాంశాలకు ఎప్పుడూ రీచబులిటీ ఎక్కువ. ఇటీవల చాలా సినిమాలు ఈ జోనర్ లో తెరకెక్కి విజయం సాధించాయి. ఈ తరహా కాన్సెప్ట్ లో ఒక అందమైన ప్రేమకథను జొప్పించి.. దర్శకులు రొమాంటిక్ కంటెంట్ ఎలివేషన్ తో మైమరిపిస్తున్నారు. ఇంతలోనే ట్రాజిక్ ఎలివేషన్ తో షాక్ లు ఇస్తున్నారు. అన్ని సినిమాలు ఛార్మి మంత్ర లా ఉండాల్సిన అవసరం లేదు. అయితే హారర్ థ్రిల్స్ కెరీర్ మర్డర్ మిస్టరీ ఇలా రకరకాల కోణాల్ని టచ్ చేస్తూ నవతరం దర్శకరచయిత లోకేష్ బండి చేస్తున్న ప్రయత్నం - ఆల్ఫా. స్టోరి- స్క్రీన్ ప్లే- దర్శకత్వం ఆయనే. దర్శకుడే హీరోగా నటించారు. నాగబాబు కొణిదెల సమర్పణలో ఆయన సొంత చానెల్ `మన చానెల్` లో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారు. నాగబాబు ఆశీస్సులతో తాజాగా ఆల్ఫా ట్రైలర్ విడుదలైంది. ఇంతకీ ఈ ట్రైలర్ లో ఏం ఉంది? అంటే..
మల్టిపుల్ ఎలిమెంట్స్ తో వెబ్ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం సాగుతుంది. ముఖ్యంగా సస్పెన్స్ హారర్ తో ఆకట్టుకుంటోంది. అసలు వైఫ్ అండ్ హజ్బెండ్ విరాట్ - సృష్టి ప్రయత్నాలేమిటి? ఈ జంట నడుమ అకస్మాత్తుగా ఏం జరిగింది? పెళ్లయినా కమాన్ అని భార్యని అడగడం ఎందుకు? ఇంతకీ ఆరోజు నైట్ పార్టీలో ఏమైంది? ఇందులోనే కిడ్నీ అమ్మకాల మాఫియా కథేంటి? సినిమాల్లో అవకాశాల కోసం వెతికే కథానాయిక.. కమిట్ మెంట్ కి ఓకే చెప్పిందా?.. సడెన్ యాక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ లు వగైరా వగైరా మల్టిపుల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. అసలు ఆత్మలకు భూమ్మీద ఉండాల్సిన అవసరం ఏమిటి? అన్న పాయింట్ పై రీసెర్చ్ ని ఈ సిరీస్ లో ఎలివేట్ చేస్తున్నారు. ఫిజిక్స్ తెలిసిన కథానాయకుడు విరాట్ ఆత్మలను నమ్మడమేమిటి? అన్నది ఆసక్తికరం. ఇక ఈ ట్రైలర్ కి నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
నటుడిగా తొలి ప్రయత్నమే అయినా లోకేష్ బండి డీసెంట్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. నటీనటులంతా కొత్త వాళ్లు.. అయినా గ్రిప్పింగ్ నేరేషన్ తో ఈ వెబ్ సిరీస్ యంగేజ్ చేస్తుందని ట్రైలర్ భరోసానిస్తోంది. తన తొలి ప్రయత్నం సఫలమవుతుందనే దర్శకరచయిత లోకేష్ బండి చెబుతున్నారు. 7 ఎపిసోడ్లతో ఈ వెబ్ సిరీస్ తెలుగు ఆడియెన్ ని ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.