Begin typing your search above and press return to search.
నేనేమైనా రాజకీయ నేతనా? - రేణుదేశాయ్ ఆగ్రహం
By: Tupaki Desk | 19 May 2021 4:30 PM GMTకరోనా నేపథ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోయిన సంగతి తెలిసిందే. సరైన సౌకర్యాల్లేక, అవసరాలు తీరక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. పలువురు సెలబ్రిటీలు తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. వీరిలో రేణూ దేశాయ్ కూడా ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా బాధితుల వివరాలు సేకరించి, తనకు వీలైన సహాయం చేస్తున్నారు.
అయితే.. సహాయం ఆశించే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందట. తన ఇన్ బాక్స్ మొత్తం నిండిపోయిందట. అయినప్పటికీ.. వీలైనంత మందికి సహాయం అందిస్తున్నారు రేణు. అందులో ఓ వ్యక్తి చేసిన మెసేజ్ చూసి నొచ్చుకున్నారు రేణు.
''మేడం గారూ.. సహాయం చేస్తామని అన్నారు కదా.. ఎక్కడ మేడం మీ సహాయం..? ఉన్నవాళ్లనే పట్టించుకుంటారా? మీరు'' అని కామెంట్ చేశాడు. దీంతో.. సహనం కోల్పోయారు రేణు దేశాయ్. ఆ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి ఇన్ స్టాలో పోస్టు చేశారు.
తన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. తాను వీలైనంత సహాయం చేస్తున్నా కూడా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. తానేమైనా రాజకీయ నేతనా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు మీరు ఓట్లువేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులను అడగండి అని సమాధానం చెప్పారు. రేణు స్పందనకు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. సహాయం చేస్తున్నవారిని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.